Share News

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి

ABN , Publish Date - May 16 , 2026 | 12:05 AM

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలి
గోదాంల వద్ద అధికారులు, సిబ్బందికి సూచనలు చేస్తున్న జిల్లా కలెక్టర్‌.

జమ్మికుంట, మే 15 (ఆంధ్రజ్యోతి): జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌ యార్డులో మక్కల కొనుగోళ్లు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. శుక్రవారం వ్యవసాయ మార్కెట్‌ యార్డులోని మక్కల కొనుగోలు కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. కొనుగోలు చేసిన మక్కలను వెంటవెంటనే గోదాములకు తరలించి భద్రపరచాలని సూచించారు. కొనుగోళ్లలో ఇబ్బందులు ఉన్నాయా అని రైతులను అడిగి తెలుసుకున్నారు. కొనుగోళ్ల ప్రక్రియలో జాప్యం చేస్తే చర్యలు తప్పవన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ మాట్లాడుతూ రైతుల కష్టం పంట రూపంలో వస్తుందనే విషయాన్ని గమనించాలన్నారు. లోడ్‌ చేసిన బస్తాలను గోదాంలకు తరలించాలని, గోదాంలో నిల్వ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. మార్కెట్‌ యార్డు పక్కన ఉన్న గోదాంను పరిశీలించారు. కొనుగో లు చేసిన ప్రతి బస్తాను సురక్షితంగా గోదాంలో భద్రపరుచాలని, ఎప్పటికప్పుడు లిఫ్టింగ్‌ చేయాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ పుల్లూరి స్వప్న, ఆర్డీవో రమేష్‌ బాబు, జిల్లా మార్కెటింగ్‌ ఆఫీసర్‌ మహమ్మద్‌ షహబుద్దీన్‌, తహశీల్దార్‌ వెంకట్‌రెడ్డి అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 16 , 2026 | 12:05 AM