Share News

మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు కృషి

ABN , Publish Date - Apr 12 , 2026 | 02:02 AM

జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్‌ జెండర్‌ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.

మహాత్మా జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు కృషి
మాట్లాడుతున్న మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌

-మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌

జగిత్యాల, ఏప్రిల్‌ 11 (ఆంధ్రజ్యోతి): జ్యోతిబాఫూలే ఆశయ సాధనకు అందరూ కృషి చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ అన్నారు. శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకల్లో రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, వయోవృద్దులు, వికలాంగులు, ట్రాన్స్‌ జెండర్‌ సాధికారిత శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ బి. సత్యప్రసాద్‌ లతో కలిసి పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి, జ్యోతిబా పూలే చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ ఏప్రిల్‌ మాసం అంటేనే మహనీయుల మాసం అని అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే విద్యా విప్లవానికి నాంది పలికిన ఆయన మహిళల విద్యకు ప్రాధాన్యతనిస్తూ తొలి బాలికల పాఠశాలను స్థాపించారన్నారు. సమాజంలో ఉన్న అసమానతలను తొలగించడానికి శ్రమించి, అణగారిన వర్గాలకు సమాన హక్కులు కల్పించాలనే లక్ష్యంతో పలు కార్యక్రమాలు చేపట్టారని వివరించారు. దేశంలోని అణగారిన వర్గాల కోసం మహాత్మా జ్యోతిరావు ఫూలే సమాజంలో సమానత్వం, విద్య, న్యాయం కోసం చేసిన కృషి ఎల్లప్పుడూ స్ఫూర్తిదాయకమని తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతికి ఆయన చూపిన మార్గం ప్రస్తుత ప్రభుత్వానికి మార్గదర్శకమని అన్నారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక కార్యక్రమాలు పకడ్బందీగా అమలు చేస్తూ తెలంగాణ ప్రజా ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డి ఆధ్వర్యంలో మహనీయుల జయంతుల వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అదేవిధంగా ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా పేదలు, దళితులు, బలహీన వర్గాల అభివృద్ధికి కట్టుబడి ఉందని పేర్కొన్నారు. ముఖ్యంగా విద్య, ఉపాధి, సామాజిక న్యాయం రంగాల్లో ఫూలే గారి ఆశయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నామని తెలిపారు. జగిత్యాల జిల్లా విద్యా రంగంలో మరియు మహిళాభివృద్ధి కొరకు అనేక పథకాలు అమలు చేస్తుందని తెలిపారు. జిల్లాకు అంబేద్కర్‌ స్టడీ సర్కిల్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు. అదేవిధంగా రెసిడెన్సియల్‌ పాఠశాల అడ్మిషన్స్‌ కొరకు ఎంతమంది అప్లికేషన్‌ చేసుకున్నా అవకాశం కలిపించాలని అధికారులకు సూచించారు. ప్రతి ఒక్కరూ మహాత్మా ఫూలే ఆలోచనలను ఆచరణలో పెట్టి సమాజంలో సమానత్వం నెలకొల్పడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్‌ మాకునూరి సంజయ్‌ కుమార్‌, జిల్లా కలెక్టర్‌ సత్య ప్రసాద్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) బీఎస్‌ లత, జగిత్యాల మున్సిపల్‌ చైర్మన్‌ సమిండ్ల వాణి శ్రీనివాస్‌, డీసీసీ అధ్యక్షుడు గాజెంగి నందయ్య, జిల్లా స్థాయి అధికారులు, కలెక్టరేట్‌ ఏవో కిషన్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు, ప్రజా ప్రతినిధులు, వివిధ కుల సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు మరియు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 12 , 2026 | 02:02 AM