Share News

25న కార్మికుల సమస్యలపై మహాధర్నా

ABN , Publish Date - Mar 22 , 2026 | 12:29 AM

చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలపై ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లో చేపట్టిన మహా ధర్నా చేయాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలుతెలిపారు.

25న కార్మికుల సమస్యలపై మహాధర్నా

సిరిసిల్ల అర్బన్‌, మార్చి 21 (ఆంధ్రజ్యోతి) : చేనేత, మరమగ్గాల కార్మికుల సమస్యలపై ఈనెల 25వ తేదీన హైదరాబాద్‌లో చేపట్టిన మహా ధర్నా చేయాలని సీఐటీయూ తెలంగాణ పవర్‌లూం వర్కర్స్‌ యూనియన్‌ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేష్‌, జిల్లా అధ్యక్షుడు కోడం రమణలుతెలిపారు. సిరిసిల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌శుక్లా కార్మిక భవనంలో శనివారం సీఐటీయూ పవర్‌లూం వర్కర్స్‌ యూని యన్‌ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో రూపొందించిన మహాధర్నా కరపత్రా లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో చేనేత, మరమగ్గాల పరిశ్రమల అభివృద్ధికి, కార్మికుల సంక్షేమానికి సంబంఽధించి వివిధ పథకాల అమలు కోసం ప్రభుత్వం బడ్జెట్‌లో చేనేత రంగానికి రూ 2వేల కోట్లు, మరమగ్గాల రంగానికి రూ2వేల కోట్లను కేటా యించాలని చేనేత జౌళిశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, రాష్ట్ర అర్ధిక శాఖమంత్రి మల్లు భట్టి విక్రమార్కలను కలిసి సమస్యలను విన్నవించి వినతిపత్రాలను అందించినప్పటికి రాష్ట్ర బడ్జెట్‌లో కేవలం రూ.258 కోట్లు మాత్రమే కేటాయించి నేతన్నలకు అన్యాయం చేసిందన్నారు. మరమ గ్గాల పరిశ్రమల అభివృద్ధికి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు కావా లన్నా, కార్మికులకు సంక్షేమ పథకాలు అమలు జరగాలన్నా ప్రభుత్వం కేటాయించిన బడ్జెట్‌ ఏమాత్రం సరిపోదన్నారు. రాష్ట్ర అసెంబ్లీ సమావే శాల్లో మరమగ్గాల రంగానికి బడ్జెట్‌ను పెంచి కేటాయించాలన్నారు. అలాగే వర్కర్‌ టూ ఓనర్‌ పథకంను వెంటనే పూర్తిచేసి కార్మికులకు అం దించడంతోపాటు ఇందిరా మహిళా శక్తి చీరల తయారుచేసే మరమ గ్గాల కార్మికులతో పాటు అనుబంధ రంగాల కార్మికులకు పది శాతం యారన్‌ సబ్సిడీలను అందించాలని, మరమగ్గాల పరిశ్రమల్లో పనిచేసే అన్ని విభాగాల్లోని కార్మికులకు చేనేత జౌళిశాఖ గుర్తింపు కార్డులను ఇవ్వాలన్నారు. అలాగే సిరిసిల్ల మరమగ్గాల పరిశ్రమలకు సంబంధించి విద్యుత్‌ బకాయిలు బ్యాక్‌ బిల్లులను ప్రభుత్వం చెల్లించి సమస్యను పరి ష్కరించాలి, ప్రభుత్వం నుంచి రావాల్సిన పెండింగ్‌ బకాయిలను చెల్లిం చాలని డిమాండ్‌ చేశారు. వస్త్ర పరిశ్రమలకు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో అక్కడి ప్రభుత్వాలు అమలుచేస్తున్న మాదిరిగానే ఉచిత విద్యుత్‌ పథకాన్ని అమలు చేసి త్రిఫ్ట్‌ పథకాన్ని వెంటనే ప్రారంభిం చాలనే పలు డిమాండ్‌లతో ఈనెల 25న హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్‌ వద్ద చేపట్టిన మహాధర్నాకు చేనేత, మరమగ్గాల కార్మికులు, అసా ములు తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు సిరిమల్ల సత్యం, బెజుగం సురేష్‌, ఒగ్గు గణేష్‌, సందుపట్ల పోచమల్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Mar 22 , 2026 | 12:29 AM