Share News

ఘనంగా మాఘ అమావాస్య వేడుకలు

ABN , Publish Date - Jan 18 , 2026 | 11:56 PM

మామిడిపల్లి శ్రీసీతారాముల జాతర వైభవంగా జరిగింది.

ఘనంగా మాఘ అమావాస్య వేడుకలు

కోనరావుపేట, జనవరి 18 (ఆంధ్రజ్యోతి) : మామిడిపల్లి శ్రీసీతారాముల జాతర వైభవంగా జరిగింది. సుమారు 50 వేల మంది భక్తులు జాతరలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా మాఘ అమావాస్య జాతర అత్యంత వైభవంగా జరుగుతుంది. ఈ సంవత్సరం ఆదివారం జరి గిన జాతరకు వేలాదిమంది భక్తులు పాల్గొని స్వామి వారిని దర్శించుకు న్నారు. అలాగే నాగారం శ్రీ కోదండరామస్వామి జాతర అత్యంత వైభవం గా జరిగింది. ఈ జాతర కోసం భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుం డా అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. మామిడిపల్లి శ్రీసీతారాముల జాతరకు వేలాదిమంది భక్తులు రావడంతో ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి సుమా రు 6 గంటలు భక్తులు రోడ్డుపైనే ఉండాల్సి వచ్చింది. ఇది గమనించిన చందుర్తి సిఐ వెంకటేశ్వర్లు, కోనరావుపేట ఎస్సై ప్రశాంత్‌ రెడ్డి, సిబ్బంది ట్రాఫిక్‌ ను నియంత్రించి ట్రాఫిక్‌ జామ్‌ కాకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సర్పంచులు పన్నాల లక్ష్మారెడ్డి, అప్పాల నాగభూ షణం, ఆలయ చైర్మన్‌ చెన్నమనేని శ్రీకుమార్‌, మాజీ సెస్‌ చైర్మన్‌ అల్లాడి రమేష్‌ తదితరులు పాల్గొని దర్శించుకున్నారు.

ఎల్లారెడ్డిపేట/వీర్నపల్లి : మాఘ అమవాస్య వేడుకలు ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి మండల కేంద్రాలతో పాటు అక్కపల్లి, గొల్లపల్లి, బొప్పాపూర్‌, కోరుట్లపేట, వెంకటాపూర్‌, రంగంపేట, తదితర గ్రామాల్లో ఆదివారం ఘనంగా జరిగాయి. అక్కపల్లి గ్రామ శివారులోని శ్రీ బుగ్గ రామలింగేశ్వర స్వామి ఆలయంలో వేద పండితుల ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎల్లారెడ్డిపేట, వీర్నపల్లి, కోనరావుపేట, సిరిసిల్ల, ముస్తాబాద్‌, సిరికొండ, తదితర మండలాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చారు. వేకువ జాము నుంచే భక్తులు కోనేరులో పవిత్ర స్నానాలు ఆచరించారు. రామలింగేశ్వర స్వామి, హనుమాన్‌, మల్లన్న ఆలయాల్లో పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. ఎడ్ల బండ్లపై భక్తులు తరలి వచ్చి పూజల అనంతరం వన భోజనాలు చేశారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అనంతరం అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీ కేశవ పెరుమాండ్ల ఆంజనేయ స్వామి ఆలయంలో అర్చకులు ఉదయం ఆలయంలో అభిషేకం, తదితర పూజలను నిర్వహించారు. స్వామి కల్యాణ వేడుకలను ఘనంగా జరిపించారు. గొల్లపల్లిలోని గాలం గుట్ట ఆంజనేయస్వామి ఆల యంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కోరుట్లపేట, వెంకటాపూర్‌లోని గంగమ్మ, ఆంజనేయస్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడాయి. జిల్లా ఎస్పీ మహేశ్‌.బి.గితే, డీఎస్పీ నాగేంద్రచారి, జిల్లా గ్రంథాలయ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, ఏఎంసీ చైర్‌పర్సన్‌ సబేరాబేగం, కాంగ్రెస్‌ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్‌, బీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఆగయ్య, రెడ్డి సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కృష్ణారెడ్డి, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు నర్సయ్య, ఎల్లారెడ్డిపేట రూరల్‌ సీఐ శ్రీనివాస్‌, ఎస్‌ఐ రాహుల్‌రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచులు, అధికారులు స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చి మొక్కులు చెల్లించుకున్నారు. పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 18 , 2026 | 11:56 PM