Share News

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి

ABN , Publish Date - May 15 , 2026 | 11:55 PM

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు.

మక్కలను వెంటనే కొనుగోలు చేయాలి
బీర్‌పూర్‌లో మక్కలను పరిశీలిస్తున్న మాజీ మంత్రి జీవనరెడ్డి

బీర్‌పూర్‌, మే 15 (ఆంధ్రజ్యోతి): మక్కలను వెంటనే కొనుగోలు చేయాలని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి జీవనరెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. శుక్రవారం ఆయన మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం సమీపంలో ఏర్పా టుచేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ పంటలు సాగు చేసే ప్రతి రైతుకు ఆనలైనలో నమోదు చేసుకోవడం రాదన్నారు. వ్యవసాయ శాఖ అధికారులే రైతులు ఎవరు ఏ పంట వేశారు అనేది తెలుసుకొని ఆనలైన చేయాలని కోరారు. జిల్లాలో ఎక్కువగా మొక్కజొన్న పంట వేశారని అన్నారు. ధాన్యం తడిసినా సేకరించే అవకాశం ఉంటుందని, కానీ మొక్కజొన్న ఒక్కసారి తడిస్తే ఫంగస్‌ వస్తుందని, కనీసం పశువులు కూడా ముట్టుకోవని తెలిపారు. ఆయన వెంట మాజీ ఎంపీపీ మసర్తి రమేష్‌, మాజీ జడ్పీటీసీ ముక్క శంకర్‌, నాయకులు జితేంధర్‌ యాదవ్‌, సుభాస్‌ యాదవ్‌, శేఖర్‌, జోగిరెడ్డి, మల్లా రెడ్డి, బదినపెల్లి శంకర్‌ తదితరులు ఉన్నారు.

కొనుగోళ్లలో జాప్యం.. కల్లాల్లో రైతుల పడిగాపులు

జగిత్యాల టౌన, మే 15(ఆంధ్రజ్యోతి): అధికారుల నిర్లక్ష్యం కారణంగా కొనుగోళ్లలో జాప్యంతో కల్లాల్లో రైతులు పడిగాపులు కాయాల్సిన పరిస్థితులు వచ్చాయని బీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ మంత్రి తాటిపర్తి జీవనరెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని జిల్లా బీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవనరెడ్డి మాట్లాడారు. దాన్యం తూకంలో జాప్యం... రవాణ, అనలోడింగ్‌ ఆలస్యానికి పాలన అధికార యంత్రాం గమే భాఽధ్యులన్నారు. కేంద్రీయ విద్యాలయం కేంద్రం కేటాయించింది.. స్థలం కేటాయించడం రాష్ట్ర ప్రభుత్వ బాధ్యత అన్నారు. లేఖలు రాయడం పక్కన పెట్టి సీఎం దగ్గరికి వెళ్లి మాట్లాడితే స్థలం మంజూరు అవుతుందని ఎమ్మెల్యేకు సూచించారు. కార్యక్రమంలో నాయకులు శీలం ప్రవీణ్‌, కల్లపల్లి దుర్గయ్య, చెట్పల్లి సుధాకర్‌, మసర్తి రమేష్‌, రమేశబాబు, గంగాధర్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 15 , 2026 | 11:55 PM