Share News

చంద్రగ్రహణం ఎఫెక్ట్‌.. పలు ఆలయాల మూసివేత

ABN , Publish Date - Mar 04 , 2026 | 12:59 AM

చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు.

చంద్రగ్రహణం ఎఫెక్ట్‌.. పలు  ఆలయాల మూసివేత
దర్మపురి ఆలయాన్ని మూసివేస్తున్న అర్చకులు

ధర్మపురి, మార్చి 3(ఆంధ్రజ్యోతి) : చంద్రగ్రహణం సందర్భంగా ధర్మపురి క్షేత్రంలోని శ్రీ లక్ష్మీ నరసింహస్వామి అనుబంధ ఆలయాలను మంగళవారం ఉదయం 9 గంటలకు మూసివేశారు. ఉదయం వేళలో స్వామి వారలకు ఆలయ ముఖ్య అర్చకులు నిత్య పూజలు, అభిషే కాలు నిర్వహించారు. అనంతరం కేవలం 9 గంటల వరకు మాత్రమే భక్తులకు దర్శనం చేసుకునే వీలు కల్పించారు. అనంతరం ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన జక్కు రవీందర్‌, ఆలయ ఈవో సంకటాల శ్రీనివాస్‌ సమక్షంలో ఆలయ ముఖ్య అర్చకులు నంబి శ్రీనివాసాచారి ఆలయానికి తాళం వేసి మూసి వేశారు. తిరిగి ఈ నెల 4న బుధవారం ఉదయం సంప్రోక్షణ అనంతరం భక్తులకు దర్శనాలు ప్రారంభిస్తారు. కార్యక్రమంలో ఆలయ సూపరింటెం డెంట్‌ ద్యావళ్ల కిరణ్‌, అర్చకులు పాల్గొన్నారు.

కొండగట్టులో..

మల్యాల: రాహుగ్రస్త చంద్రగ్రహణం సందర్భంగా కొండగట్టు ఆంజనేయస్వామి ఆలయాన్ని మంగళ వారం ఉదయం 7.30 గంటలకు మూసివేశారు. ఉదయం స్వామి వారికి నివేదన అనంతరం మూసి వేయగా ఆర్జితసేవలు కూడా నిలిపివేశారు. అనం తరం సాయంత్రం 7 గంటలకు తిరుమంజనం, సంప్రోక్షణ కార్యక్రమాల అనంతరం ఆలయాన్ని మళ్లీ తెరిచారు. బుధవారం వేకువజాము నుంచి భక్తులకు యదావిధిగా దర్శనం కొనసాగనుంది.

Updated Date - Mar 04 , 2026 | 12:59 AM