రెండో రోజూ గణనాథుల నిమజ్జనోత్సవం
ABN , Publish Date - Sep 27 , 2026 | 12:10 AM
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండో రోజు శనివారం అత్యంత వైభ వోపేతంగా వినాయక నిమజ్జనోత్సవం కొనసాగింది.
(ఆంధ్రజ్యోతి, సిరిసిల్ల)
రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో రెండో రోజు శనివారం అత్యంత వైభ వోపేతంగా వినాయక నిమజ్జనోత్సవం కొనసాగింది. ఒకటి రెండు సంఘటన లు మినహా శనివారం సాయంత్రం నిమజ్జనం ప్రశాతంగా ముగించారు. సిరిసిల్ల పద్మనగర్‌లో తెల్లవారుజా మున రెండు సంఘాల యువకుల మధ్య వినాయకుడిని నిమజ్జనానికి తరలించే క్రమంలో గొడవకు దారి తీసింది. దీంతో ఇరువురు పరస్పర దాడులు చేసుకున్నారు. ఒకరు తల్వా ర్‌తో దాడి చేయడంతో నాగరాజు అనే యువకుడు తీవ్రంగా గాయపడగా మరో ముగ్గురికి గాయాలయ్యాయి. పోలీసుల జోక్యంతో సద్దుమణిగింది. నిమజ్జనోత్సవంతో శుక్రవారం రాత్రి ఉదయం వరకు సిరిసిల్ల పట్టణ ప్రజ లు నిద్రపోకుండా శోభాయాత్రలో జనం పాల్గొన్నారు. గతంలో నిమజ్జ నం అనగానే ఉదయం నుంచి రాత్రి 11 గంటలకు ముగిసిపోయేది. ఉద యం వేళల్లో మాత్రమే మహిళలు, యువతులు కనిపించేవారు. ఈసారి మాత్రం వినాయకుని సాగనంపే వర కు యువతి, యువకులు నృత్యాలు చేస్తూ సంబరంగా గడిపారు. కాలనీ లోని కుటుంబాలు, యువకులు నిమ జ్జనోత్సవం పూర్తి వరకు ఉన్నారు. శనివారం ఉదయం నుంచి సాయం త్రం వరకు భారీ విగ్రహాలు సిరిసిల్ల మానేరు చెంతకు వెళ్లాయి. భారీ క్రేన్ల సహాయంతో మానేరు వాగులు నిమ జ్జనం చేశారు. ఎస్పీ మహేష్ బీ గీతే, డీఎస్‌పీ నాగేంద్రచారి, సీఐలు నిమ జ్జోత్సవాన్ని ప్రశాంతంగా పూర్తిచేసే దిశగా పర్యవేక్షించారు. భారీ విగ్రహా లు రోడ్లపై సందడిగా కనిపించాయి. జిల్లా వ్యాప్తంగా వినాయక నిమజ్జనో త్సవం ఎలాంటి అవాంఛనీయ సం ఘటనలు జరగకుండా ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ మహేష్ బీ గీతే అభినందించారు. సిరిసిల్ల మానేరు తీరంలో నిమజ్జనో త్సవాన్ని పరిశీలించారు. నిమజ్జనం విజయవంతంగా పూర్తయ్యేందుకు సహకరించిన జిల్లా ప్రజలకు, మండ పాల నిర్వాహకులకు ఎస్పీ ప్రత్యేకం గా కృతజ్ఞతలు తెలిపారు. వినాయక విగ్రహాల నిమజ్జన ప్రక్రియ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా, ట్రాఫిక్‌కు అంతరా యం లేకుండా, సామాన్య ప్రజానీకా నికి ఇబ్బందులు కలగకుండా ప్రశాం తంగా పూర్తిచేశారని తెలిపారు.