Share News

గంగమ్మ ఒడికి గణనాథుడు..

ABN , Publish Date - Sep 24 , 2026 | 12:17 AM

నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథు డు బుధవారం అశేష భక్తజనం జేజే లు పలుకుతుండగా గంగమ్మ ఒ డిలోకి చేరుకున్నాడు.

గంగమ్మ ఒడికి గణనాథుడు..

వేములవాడ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): నవరాత్రులు విశేష పూజలు అందుకున్న గణనాథు డు బుధవారం అశేష భక్తజనం జేజే లు పలుకుతుండగా గంగమ్మ ఒ డిలోకి చేరుకున్నాడు. వేముల వాడ పట్టణంలో బుధవారం రాజన్న ఆలయ గుడి చెరువుపై ఏర్పాటు చేసిన మినీ ట్యాంక్‌ బండ్‌లో మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు ఆధ్వర్యంలో నిమజ్జన వేడుకలను ఘ నంగా ఏర్పాటు చేశారు. పట్టణంలోని వాడవాడలా గణనాథుని విగ్రహాలు నిమజ్జనానికి తరలించే సమ యంలో డిజే సౌండ్స్‌, డప్పు చప్పుళ్ల మధ్య శోభాయాత్రలో భక్తులు చేసిన నృత్యాలు ఆక ట్టుకున్నాయి.

భారీ సంఖ్యలో తరలి వచ్చిన గణనాథులను నిమజ్జనం చేసేం దుకు మున్సిపల్‌ ఆధ్వర్యంలో భారీ క్రేన్‌లతో పాటు గజ ఈత గాళ్లను, గుడిచెరువులో బోట్‌ సౌకర్యాన్ని కల్పించారు. గుడి చెరువులో ఏర్పాటు చేసిన సాం స్కృతిక కార్యక్రమాలను, నిమజ్జనో త్సవాలను చూసేందుకు పట్టణ, చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలి వచ్చా రు. నిమజ్జనో త్సవాలకు ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ ముఖ్య అతిథిగా హాజరై మున్సిపల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన గణేషుడి వద్ద ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం గణేషుడు కొలువు దీరిన ప్రత్యేక వాహనాన్ని ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ నడిపించారు. అనంతరం బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ప్రతాప రామకృష్ణ, మున్సిపల్‌ చైర్మన్‌ పుల్కం రాజు, వైస్‌ చైర్మన్‌ నరాల శేఖర్‌, కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు తూమ్‌ మధుతో పాటు కౌన్సిలర్లతో కలిసి నృత్యం చేశారు. వినాయక నిమజ్జనోత్సవాల్లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన గొండు నృత్య కళాకారు లతో ఆది శ్రీనివాస్‌ చేసిన నృత్యం ఆకట్టుకుంది. భీమన్న ఆలయంలో ఏర్పాటు చేసిన సిద్ధిబుద్ధి వినాయకుడి వద్ద ఆలయ ఈవో రమాదేవి, డిప్యూటీ ఈవో ప్రతాప నవీన్‌ కుమార్‌ పూజలు నిర్వహించి గణేష్‌ని నిమజ్జనం చేశారు.

పకడ్బందీ ఏర్పాట్లు..

నిమజ్జన వేడుకల్లో అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌, ఎస్పీ మహేష్‌ బి గితేలు అన్ని శాఖల అధికారులతో సమన్వయంతో ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టారు. నిమజ్జనోత్సవా లకు డీఎస్పీ శ్రీనివాసులు, పట్టణ సీఐ వీరప్రసాద్‌, రూరల్‌ సీఐ శ్రీనివాస్‌లతో పాటు మున్సిపల్‌ కమి షనర్‌ లోకేష్‌, మేనేజర్‌ సంపత్‌రెడ్డి, తహసీల్దార్‌ జయంత్‌ కుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

శోభాయాత్రలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ నేతలు..

పట్టణంలో నిర్వహించిన గణేష్‌ నిమజ్జనోత్సవ శోభాయాత్రలో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ప్రతాప రామకృష్ణ, కోల కృష్ణస్వామి, పట్టణ అధ్యక్షుడు రాపెల్లి శ్రీధర్‌లు నృత్యాలు చేశారు. రాజన్న ఆలయం ముందు గణేష్‌ల వద్ద ఒగ్గుడోలు కళాకారులతో డోలు కొడుతూ సందడి చేశారు. పట్టణంలోని పలు వినాయక మండ పాల వద్ద బీఆర్‌ఎస్‌ నేత చల్మెడ లక్ష్మీనర్సింహారావు, ఏనుగు మనోహర్‌రెడ్డి ప్రత్యేక పూజలో పాల్గొన్నారు. అనంతరం గుడిచెరువు ట్యాంక్‌ బండ్‌ వద్దకు చేరుకుని గణేష్‌ విగ్రహాలకు వీడుకోలు పలికారు.

చందుర్తి : మండల కేంద్రంలో గణేష్‌ నిమజ్జన వేడుకలను బుధవారం ఘనంగా నిర్వహించారు. భక్తిశ్ర ద్ధలతో డప్పుచప్పుళ్ల మధ్య నృత్యాలు, భజనలు చేస్తూ, మహిళలు కోలాటం ఆడుతూ స్వామివారిని ఊరేగింపు తీసుకెళ్లి గ్రామశివారుల్లో చెరువులో నిమజ్జనం చేశారు. సీఐ రవిందర్‌, ఎస్సై రమేష్‌ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.సర్పంచ్‌ పులి సత్తయ్య, సింగిల్‌ విండో మాజీ చైర్మన్‌ తిప్పని శ్రీనివాస్‌, బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మార్త సత్తయ్య, ప్రధాన కార్యదర్శి సిరికొండ శ్రీనివాస్‌, సింగిల్‌విండోడైరెక్టర్‌ చిలుక త్రిభు వన్‌, నాయకులు చిలుక అంజిబాబు, మొకిలె విజేందర్‌, బాశేట్టి భాస్కర్‌, నాగుల శంకరయ్య, చిర్రం తిరుపతి, మల్లయ్య, యూత్‌ క్లబ్‌ సభ్యులు పాల్గొన్నారు.

ఇల్లంతకుంట : తొమ్మిది రోజుల పాటు భక్తుల పూ జలు అందుకున్న వినాయక విగ్రహాలను ఆనందోత్సా హాల మధ్య నిమజ్జనం చేశారు. మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో బుధవారం సాయంత్రం వాహ నాలపై క్రేన్‌ల సహాయంతో వినాయక విగ్రహాలను పెట్టారు. బస్టాండ్‌ ప్రాంతంలోని వినాయక మండపం వద్ద లడ్డూను లక్కీడిప్‌ ద్వారా ఎంపిక చేసి అందిం చారు. మహిళల కోలాటం, దాండియా నృత్యాలు, యు వకుల డ్యాన్స్‌లతో శోభాయాత్ర కొనసాగింది. సర్పంచ్‌ ల ఫోరం అధ్యక్షుడు మామిడి రాజు, యువజన సం ఘాల అధ్యక్షుడు రేగుల కార్తీక్‌లు స్వాగతం పలికారు. అనంతరం గ్రామాల సమీపంలోని కుంటల్లో నిమజ్జ నం చేశారు. అవాంఛనీయ సంఘటలు జరగకుండా ఎస్సై ఉపేంద్రచారి ఆధ్వర్యంలో పోలీసులు భద్రతా చర్యలు చేపట్టారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు, వార్డుస భ్యులు, మండపాల నిర్వాహకులు పాల్గొన్నారు.

ఎల్లారెడ్డిపేట : ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంతో పాటు పలు గ్రామాల్లో వినాయక నిమజ్జన వేడుకలు బుధవారం రాత్రి వైభవంగా జరిగాయి. తొమ్మిది రోజుల పాటు పూజలందుకున్న గణనాథుడిని ప్రత్యేక వాహనాల్లో వీధుల గుండా ఊరేగించారు. యువకులు, మహిళల నృత్యాలు, కోలాటల నడుమ ఆది దేవుడు ముందుకు కదిలారు. మహిళలు భక్తిశ్రద్ధలతో మంగళహారతులు సమర్పించారు. అంతకు ముందకు లడ్డుకు వేలం పాటలు నిర్వహించగా పలువురు పోటీ పడి దక్కించుకున్నారు. అనంతరం గ్రామ శివారులోని నీటి వనరుల్లో నిమజ్జనం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ వెంకటేశ్‌, ఎస్‌ఐ రమేశ్‌ ఆధ్వర్యంలోని పోలీసులు బందోబస్తు చర్యలు చేపట్టారు.

గంభీరావుపేట : మండల కేంద్రంలో స్వర్ణకారుల జాగృతి మిత్ర బృందం ఆధ్వర్యంలో కొలువు దీరిన వినాయకుడి నిమజ్జనోత్సవం బుధవారం ఘనంగా నిర్వహించారు. ఎలాంటి డీజే సౌండ్‌, బ్యాండ్‌ సౌండ్‌ లు, డప్పు చప్పుళ్ళు లేకుండా భక్తి శ్రద్దలతో భజన పాటలతో నిమజ్జన శోభాయాత్ర కొనసాగింది. అనంత రం గ్రామ సమీప చెరువులో వినాయకుడిని నిమజ్జ నం చేశారు.

బోయినపల్లి : బోయినపల్లి మండలంలోని వివిధ గ్రామాల్లో గణేష్‌ నవరాత్రి ఉత్సవాలు ముగియడంతో బుధవారం గణేష్‌ విగ్రహాల నిమజ్జన వేడుకలను భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆయా గ్రామాల్లో గణేష్‌ మండపాల వద్ద ప్రత్యేక పూజలు, హోమాలు నిర్వహించిన అనంతరం గణేష్‌ విగ్రహాలను ఊరేగిం పుగా నిమజ్జన ప్రాంతాలకు తరలించారు. యువత, భక్తులు డీజేలు, భజనలు, కోలాటాలతో ఉత్సాహంగా పాల్గొని గణపతి బప్పా మోరియా అంటూ నినాదాలు చేశారు. మహిళలు, చిన్నారులు పెద్ద సంఖ్యలో పాల్గొ ని గణనాథుడికి వీడ్కోలు పలికారు. పలు గ్రామాల్లో ప్రధాన వీధుల మీదుగా సాగిన గణేష్‌ శోభాయాత్రలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. నిమజ్జన కార్యక్రమాల సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు బందోబస్తు ఏరాఁటు చేశారు. గ్రామపంచాయతీ సిబ్బంది, యువజన సంఘాల ఆధ్వర్యంలో నిమజ్జన ప్రాంతాల్లో ఏరాఁట్లు చేపట్టారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా నిర్వా హకులు తగిన చర్యలు తీసుకున్నారు.

కోనరావుపేట : కోనరావుపేట మండలంలోని అన్ని గ్రామాల్లో వినాయకుని నిమజ్జనం అత్యంత వైభవంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు పూజలు అందు కున్న గణనాథుడు ట్రాక్టర్ల ద్వారా డప్పుచప్పుళ్ల మధ్య కోలాటాల మధ్య ఆటాపాటలతో తీసుకెళ్లి గ్రామాల్లోని ఆయా చెరువుల్లో నిమజ్జనం చేశారు.

Updated Date - Sep 24 , 2026 | 12:17 AM