అభివృద్ధి చూసి కాంగ్రెస్‌కు పట్టం కట్టండి
ABN , Publish Date - Jan 11 , 2026 | 12:31 AM
వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు.
వేములవాడ, జనవరి 10 (ఆంధ్రజ్యోతి): వేములవాడ పట్టణంలో కాంగ్రెస్ ప్రభు త్వం చేస్తున్న అభివృద్దిని చూసి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టాలని ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ అన్నారు. వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లి గ్రామం లోని 1, 2వ వార్డులోని డ్రైనేజీ, సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శనివారం శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్బంగా ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజా సమస్యలు ఎక్కడ ఉంటే అక్కడ నిలబడి వాటిని పరిష్కరిస్తూ ముందుకు పోతున్నామని అన్నారు. శాత్రా జుపల్లిలో సుమారు రూ.1.43కోట్లతో పేద ప్రజలకు ఉపయోగపడేలా ఆసుపత్రి నిర్మా ణం పూర్తి కావస్తోందని చెప్పారు. స్థానికంగా ప్రభుత్వ ఆసుపత్రి నిర్మాణం చేపట్టడం తో చుట్టుపక్కల గ్రామాలకు శాత్రాజుపల్లి గ్రామం ఒక హబ్‌గా మారుతుందని తెలి పారు. త్వరలోనే పనులు పూర్తి కానున్నాయని, పనులు పూర్తి అయిన వెంటనే ఆసు పత్రి ప్రారంభం చేసుకుందామని తెలిపారు. గ్రామ కూడలిలో సుమారు రూ.15 లక్షల తో నూతన జంక్షన్ సుందరీకరణ పనులు జరుగుతున్నాయని అన్నారు. గ్రామంలో 45 మందికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేశామని, ఇళ్ల నిర్మాణం శరవేగంగా జరుగుతు న్నాయని, ఇళ్ల స్థలం లేని 11 మందికి బస్ డిపో పరిధిలో ఇండ్లను మంజూరు చేసినట్లు వివరించారు. ప్రజా ప్రభుత్వం ఏర్పడిన నాటి నుండి సుమారు శాత్రాజుపల్లి గ్రామానికి రూ. 4 కోట్లపై చిలుకు నిధులు కేటాయించామని తెలిపారు. గత 50 సంవత్సరాలుగా వేములవాడ పట్టణ ప్రజలు ఎదురు చూసిన రోడ్డు విస్తరణ పనులు, గత ప్రభుత్వం అభివృద్ది చేస్తానని మాట తప్పి చేయలేక పోయిన రాజన్న ఆలయ అభివృద్ది పనులు వేగంగా జరుగుతున్నాయని అన్నారు. రాష్ట్రాన్ని గత పాలకులు అప్పుల ఊబిలో ముంచారని విమర్శించారు. సీఎం రేవంత్‌రెడ్డి రాష్ట్రంలో అభివృద్ది, సంక్షేమాన్ని ఎక్కడ కూడా ఆపడం లేదని సూచించారు. కొత్తపేట చెరువు, బామట్ల కుంటలో నీటిని నింపుతామని హామీచ్చారు. కాల్వలో ఎమైనా పిచ్చిమొక్కలు ఉంటే వాటిని తొలగించాలని అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వ ఆసుపత్రిని పరిశీలించిన విప్ ఆది శ్రీనివాస్..
వేములవాడ మున్సిపల్ పరిధిలోని శాత్రాజుపల్లిలో రూ. 1.43 కోట్లతో నిర్మిస్తున్న 30 పడకల ఆసుపత్రిని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. పనుల్లో నాణ్యతను పాటించాలని అన్నారు. పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వేములవాడ మార్కెట్ కమిటీ చైర్మన్ రొండి రాజు, మున్సిపల్ కమిషనర్ అన్వేష్, డిసీసీ అధ్యక్షుడు సంఘ స్వామి యాదవ్, నాయకులు బండ హన్మావ్వ, లింగంపల్లి కిరణ్, పొన్నాల మోహన్, స్తంభంపల్లి తిరుపతి, కిషన్, అంజయ్య, కొమురయ్య, లక్ష్మిరాజం తదితరులు ఉన్నారు.