Share News

కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు వినియోగించుకోవాలి

ABN , Publish Date - Jun 21 , 2026 | 12:41 AM

కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధితులు లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యా యమూర్తి పి.నీరజ కోరారు.

కేసుల సత్వర పరిష్కారానికి లోక్‌అదాలత్‌లు వినియోగించుకోవాలి

సిరిసిల్ల రూరల్‌, జూన్‌ 20(ఆంధ్రజ్యోతి) : కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధితులు లోక్‌ అదాలత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యా యమూర్తి పి.నీరజ కోరారు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌ అదాలత్‌ కార్యక్ర మాన్ని నిర్వహించి 3909 కేసులను పరిష్కరించి రూ. 2,27,71,225 నష్ట పరిహారం బాధితులకు ఇప్పించారు. ఈ జాతీయ లోక్‌అదాలత్‌లో మోటార్‌వాహన ప్రమాద కేసులు 15, సివిల్‌ తగాదాలు 10, క్రిమినల్‌ కేసులు 246, సైబర్‌ క్రైం కేసులు 61, ఎక్సైజ్‌ కేసులు 9, చెక్‌ బౌన్స్‌ కేసులు 4, కుటుంబ తగాదాలు 8, బ్యాంకుల కేసులు 86, బీఎస్‌ఎన్‌ఎల్‌ కేసులు 23, డ్రంకెన్‌ డ్రైవ్‌ కేసులు 1028, ట్రాఫిక్‌ చలాన్‌ కేసులు 2419, పరిష్కరిం చడంతో రూ.2కోట్ల27లక్షల71వేల225 నష్టపరిహారాన్ని ఇప్పించామని జిల్లా ప్రధానన్యాయమూర్తి నీరజ తెలి పారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో జిల్లా ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ మాట్లాడుతూ కేసు లను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలనే ధ్యేయంతో లోక్‌ అదాలత్‌లను ఏర్పాటుచేయడం జరుగు తుందని, ఇందులో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌, అదనపు ఎస్పీ చంద్రయ్య, సీనియర్‌ సివిల్‌జడ్జీ సిరిసిల్ల-కమ్‌ ఎఫ్‌ఏసీ కార్యదర్శి డీఎల్‌ఎస్‌ఏ లక్ష్మణాచారీ, సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు అవునూరి రమాకాంత్‌రావు, లోక్‌ అదాలత్‌ సభ్యులు చింతోజు భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాధిత బాలుడికి న్యాయమూర్తి కరచాలనం

సిరిసిల్ల జిల్లా కోర్టులో శనివారం నిర్వహించిన జాతీ య లోక్‌ అదాలత్‌ కార్యక్రమంలో మోటార్‌ వాహన ప్రమాద కేసుకు సంబంధించిన బాధిత బాలుడు కుటుంబ సభ్యులు రాగా ఈ సంద ర్భంగా పోక్సో ప్రత్యేక న్యాయమూ ర్తి రాధిక జైస్వాల్‌ బాలుడిని ఆప్యా యంగా పలకరించి కరచాలనం చేసి మానవతా దృక్పథాన్ని చాటా రు. న్యాయమూర్తి బాలుడి ఆరో గ్యం, విద్యాభ్యాసం, సంక్షేమం గు రించి అడిగి తెలుసుకొని, ఎలాంటి భయాందోళనలకు గురికాకుండా ధైర్యంగా ఉండాలని సూచించారు. చిన్నారులకు కోర్టు వాతావరణం స్నేహపూర్వకంగా ఉండేలా చేస్తున్నామని తెలిపారు. ఈ కేసులో బాలుడికి 7లక్షల 50వేల రూపాయల నష్టపరిహారాన్ని సంబంధిత ఇన్సూరెన్స్‌ కంపెనీ నుంచి ఇప్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి రాధిక జైస్వాల్‌ మాట్లాడుతూ రాజీ మార్గం ద్వారా కేసుల పరిష్కారం వేగవంతంగా జరుగుతుందని అన్నారు.

Updated Date - Jun 21 , 2026 | 12:41 AM