లోక్‌అదాలత్‌లను వినియోగించుకోవాలి
ABN , Publish Date - Mar 29 , 2026 | 12:25 AM
కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధితులు లోక్‌అదా లత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి నీరజ కోరారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 28 (ఆంధ్రజ్యోతి) : కేసులను సత్వరమే పరిష్కరించుకునేందుకు బాధితులు లోక్‌అదా లత్‌లను వినియోగించుకోవాలని జిల్లా ప్రధాన న్యాయ మూర్తి నీరజ కోరారు. సిరిసిల్ల జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్‌అదాలత్‌ను ఏర్పాటు చేశారు. ఈ లోక్‌అదా లత్‌లో 14,820 కేసులను పరిష్కరించి రూ.6కోట్ల74లక్షల 41వేల 119 నష్టపరిహారంగా ఇప్పించారు. ఈ లోక్‌అదా లత్‌లో మోటార్ వాహన ప్రమాద కేసులు 13, సివిల్ తగాదాలు 17, క్రిమినల్ కేసులు 330, ఎక్సైజ్ కేసులు 43, చెక్‌బౌన్స్ కేసులు 20, కుటుంబ తగాదాలు 10, బ్యాంకు కేసులు 45, బీఎస్‌ఎన్‌ఎల్ కేసులు 10, డ్రంకెన్ డ్రైవ్ 1851, ట్రాఫిక్ చలాన్ కేసులు 12,481 కేసులను పరిష్క రించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానన్యాయమూర్తి నీరజ మాట్లాడుతూ కేసులను పెండింగ్‌లో పెట్టకుండా త్వరగా పరిష్కరించాలనే ధ్యేయంలో లోక్ అదాలత్‌లను ఏర్పాటుచేయడం జరుగుతుందని, ఇందులో కేసులను పరిష్కరించుకోవాలని కోరారు. ఈ లోక్‌అదాలత్‌లో పోక్సో కోర్టు న్యాయమూర్తి రాధిక జైస్వాల్, సీనియర్ సివిల్ జడ్జి సిరిసిల్ల ఇన్‌చార్జి లక్ష్మణాచారి, అదనపు ఎస్పీ చంద్రయ్య, సిరిసిల్ల బార్ అసోషియేషన్ అఽధ్యక్షులు జూపెల్లి శ్రీనివాసరావు, లోక్ అదాలత్ సభ్యులు చింతోజు భాస్కర్, రవీందర్‌రావు, న్యాయవాదులు తదితరు లు పాల్గొన్నారు.
బాధితురాలి వద్దకే వెళ్లి..
జిల్లా కోర్టులో జరిగిన జాతీయ లోక్ అదాలత్‌లో భాగంగా మోటార్ వాహన ప్రమాద పరిహారం కేసులో గాయపడి నడవలేని స్థితిలో ఉన్న బాధితురాలి దగ్గ రకు పోక్సో జిల్లా జడ్జి రాధిక జైస్వాల్ స్వ యంగా వెళ్లి పరిశీలించారు. బాధితురాలి కి ఇబ్బంది కలగకుండా న్యాయం అందించాలనే లక్ష్యంతో ఆమె వద్దకు వెళ్లి కేసు వివరాలు తెలుసుకుని సమస్య పరిష్కారానికి మార్గదర్శకాలు అందించారు.