లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలి
ABN , Publish Date - Mar 17 , 2026 | 11:56 PM
జిల్లాలోని ప్రజలందరు ఈనెల 28న జరిగే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి. పుష్పలత కోరారు.
సిరిసిల్ల అర్బన్, మార్చి 17 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని ప్రజలందరు ఈనెల 28న జరిగే లోక్‌అదాలత్‌ను సద్వినియోగం చేసుకుని కోర్టులో పెండింగ్‌లో ఉన్న కేసులను పరిష్కరించుకోవాలని జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ అధ్యక్షురాలు బి. పుష్పలత కోరారు. సిరిసిల్ల జిల్లా కోర్టు సముదాయంలో మంగళవారం జిల్లాకు చెందిన న్యాయమూర్తులు, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, పోలీసు అధికారులు, న్యాయవాదులతో సమన్వయ సమావేశా న్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్‌చార్జి ప్రధాన న్యాయమూర్తి పుష్పలత మాట్లాడుతూ సాధ్యమైనంత వరకు ఎక్కువ కేసుల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. పోలీసు అధికారులకు పలు సలహాలు సూచనలు చేశారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ చంద్రయ్య, సీనియర్ సివిల్ జడ్జి లక్ష్మ ణాచారి, వేములవాడ సీనియర్ సివిల్ జడ్జి అజయ్‌కుమార్, సిరిసిల్ల డీఎస్పీ నాగేంద్రచారి, వేములవాడ డీఎస్పీ శ్రీనివాస్, జడ్జిలు ప్రవీణ్, సృజన, జ్యోతిర్మ యి, కుమారి మేఘన, బార్ అసోషియేషన్ అధ్యక్షుడు జూపెల్లి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.