వ్యక్తిత్వ నిర్మాణంలో గ్రంథాలయాల ప్రాత కీలకం
ABN , Publish Date - Nov 21 , 2026 | 12:03 AM
వ్యక్తిత్వ నిర్మాణంలో గ్రం థాలయాల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు.
సిరిసిల్ల టౌన్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి) : వ్యక్తిత్వ నిర్మాణంలో గ్రం థాలయాల పాత్ర కీలకమని అదనపు కలెక్టర్ నగేష్ అన్నారు. శుక్రవారం జిల్లా గ్రంథాలయం సంస్థ కార్యాలయంలో చైర్మన్ నాగుల సత్యనారా యణ అధ్యక్షతన జరిగిన జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నగేష్ మాట్లాడారు. జ్ఞానాన్ని ఎవరూ దొంగిలించలేని సొత్తు అని, పుస్తక పఠనంతో అది రోజురోజుకు పెరుగుతుందన్నారు. ఆ జ్ఞానాన్ని అందించే భాండాగారం గ్రంథాలయాలన్నారు. కొందరు విద్యార్థు లు తరగతి పుస్తకాలు, సిల బస్‌కే పరిమితమై జీవితాల్లో ఎదురయ్యే ఒడిదుడుకులను తట్టుకోలేకపో తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి విద్యార్థి వారంలో ఒక పుస్తకం చదివేలా ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ప్రోత్సహించాలన్నారు. అంతకు ముందు అతిథులకు స్వాగతం పలుకు తూ సాంస్కృతిక కార్యక్రమాలతో విద్యార్థులు అకట్టుకున్నారు. కార్యక్రమం లో గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఐ శంకరయ్య, కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు సంగీతం శ్రీనివాస్, పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు సూర దేవరాజు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షుడు రియాజ్, కౌన్సిలర్ వెంగళ లీలాలక్ష్మీనర్సయ్య, మాజీ కౌన్సిలర్ లక్ష్మీనర్సయ్య, గ్రంథాలయం సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.