Share News

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..

ABN , Publish Date - Nov 15 , 2026 | 12:18 AM

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగా రాలని, వాటిని విద్యార్థులు, యువత సద్విని యోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ అన్నా రు.

గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగారాలు..

సిరిసిల్ల టౌన్‌, నవంబరు 14 (ఆంధ్ర జ్యోతి) : గ్రంథాలయాలు విజ్ఞాన భాండాగా రాలని, వాటిని విద్యార్థులు, యువత సద్విని యోగం చేసుకోవాలని జిల్లా గ్రంథాలయం సంస్థ చైర్మన్‌ నాగుల సత్యనారాయణ అన్నా రు. శనివారం జిల్లా కేంద్రంలోని గ్రంథాల యంలో ఘనంగా జాతీయ గ్రంథాలయ వారోత్సవాలను ప్రారంభించారు. ముందుగా గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ నాగుల సత్యనారాయణ, ప్రజాప్రతినిధులు ప్రత్యేక పూజలను నిర్వహించి, భారత ప్రథమ ప్రధా న మంత్రి పండిత్‌ జవహార్‌లాల్‌ నెహ్రూ, మహానీయుల చిత్రపటానికి పూలతో నివాళు లర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యార్థులు, యువత కోసం ప్రభు త్వం జిల్లా కేంద్రంతో పాటు పలు మండలా ల్లో గ్రంథాలయాలను ఏర్పాటు చేసింద న్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగాల కోసం సిద్ధమవుతున్న విద్యార్థులు, యువతకు అవ సరమైన పుస్తకాలను అందుబాటులో ఉన్నా యని అన్నారు. విద్యార్థులు, యువత గ్రంథా లయాలను సద్వినియేగం చేసుకొని ఎంచు కున్న రంగాలలో రాణించాలని ఆకాంక్షిం చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్‌ పార్టీ పట్ట ణ అధ్యక్షుడు సూర దేవరాజు, కాంగ్రెస్‌ మహిళ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత, ఎస్సీ సెల్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకునూరి బాలరాజు, కౌన్సిలర్లు వెంగళ లీలాలక్ష్మీన ర్సయ్య, బొద్దుల శ్రీనివాస్‌, లింగంపల్లి గంగ రాజు, గ్రంథాలయం అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Nov 15 , 2026 | 12:18 AM