రోడ్డు ప్రమాదాలను సమష్టిగా నియంత్రిద్దాం..
ABN , Publish Date - Jan 01 , 2026 | 11:52 PM
రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగగా కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు.
కరీంనగర్ క్రైం, జనవరి 1 (ఆంధ్రజ్యోతి): రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమష్టిగగా కృషి చేద్దామని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ అశ్విని తానాజీ వాఖడే పిలుపునిచ్చారు. జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం సందర్భంగా గురువారం రవాణా శాఖ, ఆర్టీసీ, ఆర్‌అండ్‌బీ, ఎక్సైజ్, పోలీసులు, నేషనల్ హైవేతోపాటు వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జనవరి ఒకటి నుంచి 31 వరకు జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం నిర్వహిస్తామని తెలిపారు. ప్రజల భాగస్వామ్యంతో రోడ్డు ప్రమాదాల నియంత్రణకు రవాణా శాఖ అధికారులు వివిధ కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. వాహనాల్లో ప్రయాణించేటప్పుడు సీటు బెల్టు తప్పకుండా ధరించాలని, ఇన్సూరెన్స్, డైవ్రింగ్ లైసెన్స్ పత్రాలను వెంట ఉంచుకోవాలని చెప్పారు. ఈ సందర్భంగా జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవాలకు సంబంధించిన ఫ్లెక్సీ, పోస్టర్లు, కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డీటీసీ పురుషోత్తం, డీటీవో శ్రీకాంత్ చక్రవర్తి, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.