Share News

దేశ సమైక్యతకు కృషిచేద్దాం

ABN , Publish Date - Oct 31 , 2026 | 11:55 PM

ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను పెంచేందుకు కృషిచేద్దామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు.

దేశ సమైక్యతకు కృషిచేద్దాం
రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయిస్తున్న కలెక్టర్‌ చిత్రామిశ్రా

కరీంనగర్‌ టౌన్‌, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): ఉక్కు మనిషి సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ స్పూర్తితో దేశ సమైక్యత, సమగ్రతను పెంచేందుకు కృషిచేద్దామని కలెక్టర్‌ చిత్రా మిశ్రా అన్నారు. దేశ తొలి ఉప ప్రధాని సర్దార్‌ వల్లభాయ్‌పటేల్‌ జయంతిని పురస్కరించుకుని జిల్లా కేంద్రంలోని ఐడీఓసీలో జాతీయ ఐక్యతా దినోత్సవం శనివారం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ అధికారులు, సిబ్బంది, చేత రాష్ట్రీయ ఏక్తా దివస్‌ ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ముందుచూపు, కార్యదక్షతతో సంస్థానాలను దేశంలో విలీనం చేశారన్నారు. కులమతాలు, ప్రాంతాలకు అతీతంగా అలాంటి మహనీయులు చూపిన బాటలో నడుస్తూ దేశ అభివృద్ధిలో అందరం పాలు పంచుకుందామన్నారు. కార్యక్రమంలో డీఆర్‌వో స్వామి, వివిధ శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - Oct 31 , 2026 | 11:55 PM