Share News

కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకుందాం

ABN , Publish Date - Aug 09 , 2026 | 12:43 AM

కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకుంనేందుకు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఈనెల 10వ తేదీన సిరిసిల్లలో చేపట్టిన భారీ ర్యాలీ, మహాధర్నాలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవం తం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు.

కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకుందాం

సిరిసిల్ల అర్బన్‌, ఆగస్టు 8 (ఆంధ్రజ్యోతి) : కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకుంనేందుకు, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్‌ కోడ్‌లను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయాలంటూ ఈనెల 10వ తేదీన సిరిసిల్లలో చేపట్టిన భారీ ర్యాలీ, మహాధర్నాలో అన్ని రంగాల కార్మికులు పాల్గొని విజయవం తం చేయాలని సీఐటీయూ జిల్లా కార్యదర్శి కోడం రమణ కోరారు. సిరిసి ల్ల పట్టణం బీవైనగర్‌లోని అమృత్‌లాల్‌ శుక్లా కార్మిక భవనంలో శనివారం ఏర్పాటుచేసిన సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అవలంభిస్తున్న కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటి స్తూ కార్మిక చట్టాలు, హక్కులను పరిరక్షించుకోవడంలో భాగంగా ఈనెల 10న దేశవ్యాప్తంగా కార్మికవర్గం ప్రతిఘటన కార్యక్రమాలకు పిలుపుని చ్చిందన్నారు. దీనిలో భాగంగానే సిరిసిల్ల సీఐటీయూ జిల్లా కమిటీ ఆధ్వ ర్యంలో జిల్లాలోని అన్ని వర్గాల కార్మికులతో సిరిసిల్ల జూనియర్‌ కళాశాల మైదానం నుంచి అంబేద్కర్‌ చౌరస్తా వరకు భారీ ర్యాలీ నిర్వహించి అక్క డే ప్రధాన రహదారిపై మహాధర్నా జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమం లో జిల్లాలోని మరమగ్గాల కార్మికులు అనుబంధ రంగాల కార్మికులతో పాటు వివిధ రంగాల్లో పనిచేసే కార్మికులు పాల్గొని మన కార్మిక చట్టాల హక్కుల పరిరక్షణ కోసం జరుగుతున్న ఈ ధర్నా పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా కోశాధికారి అన్నల్‌దాస్‌ గణేష్‌, సిరిమల్ల సత్యం, దాసరి రూప, సందుపట్ల పోచమ ల్లు, కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 09 , 2026 | 12:43 AM