Share News

విద్యుత్‌ ఉద్యమ అమరులను స్ఫూర్తిగా తీసుకుందాం

ABN , Publish Date - Aug 29 , 2026 | 12:23 AM

విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు.

విద్యుత్‌ ఉద్యమ అమరులను స్ఫూర్తిగా తీసుకుందాం
స్తూపానికి పూలమాలలు వేసి నివాళులు అర్పిస్తున్న వామపక్షాల నాయకులు

భగత్‌నగర్‌, ఆగస్టు 28 (ఆంధ్రజ్యోతి): విద్యుత్‌ ఉద్యమంలో అమరులైన బాలస్వామి, విష్ణువర్ధన్‌, రామకృష్ణను స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమించాలని వామపక్షాల నాయకులు పిలుపునిచ్చారు. శుక్రవారం బద్దం ఎల్లారెడ్డి భవన్‌లో సీపీఐ, సీపీఎం, సీపీఐ ఎంఎల్‌ మాస్‌లైన్‌, ఏఐఎఫ్‌బీ ఆధ్వర్యంలో విద్యుత్‌ పోరాట అమరవీరుల స్తూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెచ్చిన విద్యుత్‌ సంస్కరణల చట్టం రద్దయ్యేంతరు ఉద్యమించాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి మిల్కురి వాసుదేవరెడ్డి, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు కొయ్యడ సృజన్‌కుమార్‌, ఏఐఎఫ్‌బీ రాష్ట్ర ఇన్‌చార్జి జనరల్‌ సెక్రెటరీ అంబటి జోజిరెడ్డి, సీపీఐ ఎంఎల్‌ మాస్‌ లైన్‌ జిల్లా నాయకుడు జిందం ప్రసాద్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 29 , 2026 | 12:23 AM