Share News

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి

ABN , Publish Date - Nov 01 , 2026 | 12:13 AM

విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేం దుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని, రెమిడియేషన్‌, ఖాన్‌ అకాడమీ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ తరగతులను మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు.

విద్యార్థుల్లో అభ్యసన సామర్థ్యాలు పెంపొందించాలి
అవగాహన కార్యక్రమంలో మాట్లాడుతున్న కలెక్టర్‌

ఎంఈవోల సమావేశంలో కలెక్టర్‌

పెద్దపల్లి కల్చరల్‌, అక్టోబరు31(ఆంధ్రజ్యోతి): విద్యార్థుల అభ్యసన సామర్థ్యాలను పెంపొందించేం దుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేయాలని, రెమిడియేషన్‌, ఖాన్‌ అకాడమీ, ఎఫ్‌ఎల్‌ఎన్‌ తరగతులను మండల విద్యాధికారులు, ప్రధానోపాధ్యా యులు నిరంతరం పర్యవేక్షించాలని కలెక్టర్‌ కోయ శ్రీహర్ష సూచించారు. శనివారం జిల్లా పరిషత్‌ బాలుర ఉన్నత పాఠశాలలో ఏడు మండలాల ఎంఈవోలు, ప్రధానోపాధ్యాయులకు ఒకరోజు శిక్షణలో కలెక్టర్‌ మా ట్లాడారు. తెలుగు, ఆంగ్లం, గణితం సబ్జెక్టుల్లో నిర్వహి స్తున్న రెమిడియేషన్‌ తరగతుల పురోగతిని నిరంతరం సమీక్షించాలని, ఖాన్‌ అకాడమీలో విద్యార్థుల రిజి స్ట్రేషన్‌, అభ్యసన ఫలితాలు, ఇతర పరిపాలనా అం శాలను పర్యవేక్షించాలని సూచించారు. కలెక్టర్‌ పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా విద్యాబోధనలో అనుస రించాల్సిన పద్ధతులను వివరిస్తూ, ఉపాధ్యాయులు తరగతి గదిలో ఫెసిలిటేటర్లుగా వ్యవహరించాలని తెలిపారు. విద్యార్థులు నేర్చుకున్న అంశాలను అర్థం చేసుకొని స్వయంగా వ్యక్తీకరించేలా బోధనా పద్ధతులు ఉండాలని సూచించారు. ప్రతీ విద్యార్థి అభ్యసన స్థాయిని గుర్తించి, అవసరమైన అదనపు బోధన అం దించడం ద్వారా విద్యా ప్రమాణాలను మెరుగుపరచా లన్నారు. ఎఫ్‌ఎల్‌ఎన్‌ కార్యక్రమం పురోగతి, ఏ బుక్‌ ఆన్‌ డిజిటల్‌ లెర్నింగ్‌ అంశాలపై డిఆర్‌పీలు అవ గాహన కల్పించారు. ఏఎంఓ పిఎం షేక్‌, ఏడు మం డలాల విద్యాధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఆలోకిట్‌ ప్రతినిధులు ప్రమోద్‌, అంజద్‌, సమీద్‌, స్కూల్స్‌ ఇన్‌స్పెక్షన్‌ టీమ్‌ లీడర్‌ సిహెచ్‌ ఆగయ్య, డిఆర్‌పిలు గడ్డం జగదీశ్వర్‌, కృష్ణమోహన్‌, శ్రీనివాస్‌, శ్రీనివాస్‌, రమేష్‌, మంజుల, జ్యోతి, కిరణ్‌, కృష్ణారెడ్డి, దేవేందర్‌, రవి, పుష్పలత, సిఆర్‌పిలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 01 , 2026 | 12:13 AM