Share News

పనిచేస్తేనే నాయకులుగా ఎదుగుతారు

ABN , Publish Date - Sep 13 , 2026 | 01:06 AM

ప్రజా క్షేత్రంలో నిరంతరం పనిచేసే కార్యకర్తలే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగు తారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు.

పనిచేస్తేనే నాయకులుగా ఎదుగుతారు

సిరిసిల్ల అర్బన్‌, సెప్టెంబరు 12 (ఆంధ్ర జ్యోతి) : ప్రజా క్షేత్రంలో నిరంతరం పనిచేసే కార్యకర్తలే భవిష్యత్తులో నాయకులుగా ఎదుగు తారని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. గుజరాత్‌ ముఖ్య మంత్రిగా ప్రారంభమైన నరేంద్రమోదీ ప్రస్థా నం 25ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర, రాష్ట్ర పార్టీల ఆదేశాల మేరకు సిరిసిల్ల జిల్లా క్రేందంలోని పార్టీ కార్యాలయంలో శనివా రం సేవా సంకల్ప్‌ అభియాన్‌ జిల్లా కార్యాశాల ను జిల్లా కన్వీనర్‌, జిల్లా ప్రధాన కార్యదర్శి సిరి కొండ శ్రీని వాస్‌ అధ్యక్షతన జరిగిన జిల్లాకమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి హాజరై న జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడు తూ 25 ఏళ్లుగా దేశ ప్రధానమంత్రి నరేంద్రమో దీ సేవా ప్రస్థానం ప్రతి బీజేపీ కార్యకర్తలు స్ఫూరిగా తీసుకుని ముందు కు సాగాలని కోరారు. ఈనెల 17నుంచి అక్టోబరు 17వరకు నెలరోజుల పాటు రాష్ట్ర పార్టీ అధ్వర్యంలో చేపట్టిన తొమ్మి ది ప్రధాన కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు. పార్టీ ఇ చ్చిన కార్యక్రమాలను విజయ వంతం చేయడంతో పాటు కార్యకర్తలు నిరంతరం ప్రజా క్షేత్రంలో ఉండాలని సూచిం చారు. జిల్లాఇన్‌చార్జీ గంగాడి మోహన్‌రెడ్డి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన నెల రోజుల కార్యక్రమాలను విజయవంతం చేసేం దుకు ప్రతి కార్యకర్త సమాయాన్ని కేటాయించి క్షేత్ర స్థాయిలో పనిచేయాలని సూచించారు. ప్రతి కార్యకర్త ప్రజల కోసం పనిచేస్తూ పార్టీని బలోపేతం చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర నాయకులు ఎర్రం మహేష్‌, లింగంపల్లి శంకర్‌, కరీంనగర్‌ పార్లమెంటరీ కో-కన్వీనర్‌ దశ రథం, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు, బర్కం లక్ష్మీ, మల్లారపు సంతోష్‌రెడ్డి, జిల్లా కార్యవర్గ సభ్యులు మీసా సంజీవ్‌, జిల్లా ఎస్సీ మోర్చా అధ్యక్షుడు ఉడుగుల యాదగిరి, ఓబీసీ మోర్చా జిల్లా అధ్యక్షుడు రేగుల సంతోష్‌బాబు, మహి ళా మోర్చా జిల్లా అధ్యక్షురాలు, మాజీ జడ్పీటీసీ పల్లం అన్నపూర్ణ, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు దుమాల శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 13 , 2026 | 01:06 AM