Share News

నెలాఖరులోపు భూముల రీసర్వే పూర్తి

ABN , Publish Date - Nov 12 , 2026 | 11:57 PM

భూముల రీ సర్వేలో వేగం పెంచి ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను అదేశించారు.

నెలాఖరులోపు భూముల రీసర్వే పూర్తి

సిరిసిల్ల అర్బన్‌, నవంబరు 12 (ఆంధ్రజ్యోతి) : భూముల రీ సర్వేలో వేగం పెంచి ఈనెల 30వ తేదీలోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ అధికారులను అదేశించారు. సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో గురువారం భూముల రీసర్వేపై రెవెన్యూ, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌, వ్యవసాయ శాఖ, నీటిపారుదల శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌లో కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ సమీక్షించారు. కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భూముల రీ సర్వే ప్రక్రియ మొదలుపెట్టిందని తెలిపారు. మొదటి విడతలో చేపట్టిన 70 గ్రామా ల్లో ప్రక్రియ ఈనెల 30వ తేదీ వరకు పూర్తి చేయాలని ఆదేశించారు. భూము ల రీసర్వే కోసం కావాల్సిన రోవర్‌ యంత్రాలు త్వరలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. రెవెన్యూ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులు ఏయే గ్రామాల్లో సర్వే చేయనున్నారు. సర్వే నంబర్లు వివరాలు. తేదీల వివరాలు వ్యవసాయ శాఖ అధికారులకు ముందస్తుగా ఇవ్వాలని సూచించారు. వ్యవసాయ శాఖ అధికా రులు, జీపీఓలు పంచాయతీ కార్యద ర్శులు సర్వే చేపట్టనున్న గ్రామాల్లో రైతులు, పట్టాదారులకు సర్వేపై సమా చారం పక్కాగా చేరవేయాలని స్పష్టం చేశారు. భూముల రీ సర్వే రైతుల సమక్షంలో చేయాలని, సర్వే పూర్తయిన తర్వాత రైతుల సంతకం తీసుకోవాలని సూచించారు. తహసీల్దార్‌లు తమ మండలంలో కొనసాగుతున్న సర్వేను పూర్తిస్థాయిలో పర్యవేక్షించాలని ఆదేశిం చారు. ప్రతిరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు సర్వే ప్రక్రియ కొనసాగాలని, ప్రభుత్వ నిబంధనల మేరకు రోజు 60 నుంచి 100 ఎకరాల వరకు సర్వే చేయాలని తెలిపారు. ప్రతి రోజు సర్వే పూర్తి అయిన తర్వాత వాటికి సంబంధించిన రికార్డు పని చేసు కోవాలని సూచించారు. శాఖల అధికా రులు పూర్తి సమన్వయంతో సర్వే ప్రక్రి యను పకడ్బందీగా పూర్తి చేయాలని స్పష్టం చేశారు. సర్వే ప్రక్రియ తహసీ ల్దార్‌ల పర్యవేక్షణలో కొనసాగాలని, ఏవైనా ఇబ్బందులు ఉంటే పరిష్కరిం చాలని ఆదేశించారు. భూముల రీ సర్వే పై రైతులు అవగాహన పెంచుకోవాల ని, సర్వేకు సహకరించాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ పిలుపునిచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కేఎస్‌బీ కుమారి, సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ ఏడీ శ్రీనివాస్‌, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 12 , 2026 | 11:58 PM