Share News

భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి

ABN , Publish Date - Aug 20 , 2026 | 12:29 AM

జిల్లాలో భూముల రీసర్వే పకడ్బందీగా, పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు.

భూముల రీసర్వే పకడ్బందీగా పూర్తి

సిరిసిల్ల, ఆగస్టు 19 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో భూముల రీసర్వే పకడ్బందీగా, పారదర్శకతతో పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్ర వాల్‌ ఆదేశించారు. బుధవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌లో భూముల రీసర్వే ప్రక్రియ తదితర అంశాలపై అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌, సర్వేఅండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ అధికారులతో కలిసి కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. భూముల రీసర్వే ప్రక్రియ, వివిధ అంశాలపై తహసీల్దార్లకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించారు. జిల్లాలో చేప ట్టిన భూముల రీసర్వేలో భాగంగా ఇప్పటివరకు గంభీరావుపేట మండలం శ్రీనివాసపురం, కోనరావుపేట మండలం లచ్చపేట, వేముల వాడ మండలం చంద్రగిరి, చందుర్తి మండలం అనంతపల్లి గ్రామాల్లో చేపట్టిన సర్వే పూర్తయిందని అధికారులు కలెక్టర్‌ దృష్టికి తీసుకువె ళ్లారు. ప్రస్తుతం మరో పది గ్రామాల్లో సర్వే మొదలుపెట్టామని తెలి పారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటికే సర్వే చేసిన గ్రామాలకు సంబంధించిన రికార్డులు ఆయా మండలాల తహసీల్దార్లకు అందజేయాలని ఆదేశించారు. మిగతా గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ వేగ వంతం చేసేలా ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలని సూచించారు. భూముల వివరాలను క్షేత్ర స్థాయిలో పక్కాగా సేకరించాలని, రోజూ వారీగా లక్ష్యం నిర్దేశించుకుని, రీ సర్వే పూర్తి పారదర్శకతతో చేయాలని సూచించారు. గ్రామాల్లో సర్వే చేసే ముందు జీపీవోలు, ఏఈవోలు, పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఏ సర్వే నంబర్‌ భూముల సమాచారం ముందుగా ఆయా గ్రామాల్లో ప్రజలకు చేరవేయాలని ఆదేశించారు. గ్రామ సరిహద్దుల రీ సర్వే, ఇతర పనులను తహసీల్దార్లు క్షేత్రస్థాయిలో పరిశీలించాలని సూచించారు. అలాగే ప్రభుత్వ శాఖల భూముల వివ రాలను సంబంధిత శాఖల అధికారులకు అందజేయాలని తెలిపారు. సర్వేకు సంబంధించిన పూర్తి వివరాలు క్షేత్రస్థాయి, రికార్డులలో పరిశీ లించిన తర్వాత మిగతా ప్రక్రియ పూర్తి చేయాలని స్పష్టం చేశారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, ఏడీ సర్వే అండ్‌ ల్యాండ్‌ రికార్డ్స్‌ శ్రీనివాస్‌, తహసీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 20 , 2026 | 12:29 AM