రెడ్డి సంఘం భవన నిర్మాణానికి స్థలం..
ABN , Publish Date - Nov 15 , 2026 | 11:58 PM
మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలంతో పాటు అవసరమైన సహకారం అందిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు.
బోయినపల్లి, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి) : మండల కేంద్రంలో రెడ్డి సంఘ భవన నిర్మాణానికి స్థలంతో పాటు అవసరమైన సహకారం అందిస్తానని చొప్పదండి ఎమ్మెల్యే కరీంనగర్ డీసీసీ అధ్యక్షుడు మేడిపల్లి సత్యం హామీ ఇచ్చారు. బోయినపల్లి మండల కేం ద్రంలో ఆదివారం నిర్వహించిన మండల రెడ్డి సంఘం నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారో త్సవానికి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకు ముందు రెడ్డి సంక్షేమ సంఘం కార్యాలయం నుంచి ప్రమాణస్వీకార వేదిక వరకు మహిళలు, రెడ్డి సంఘం సభ్యులు భారీ ర్యాలీగా తరలివచ్చా రు. అనంతరం మండల రెడ్డి సంఘం అధ్యక్షుడు వరదవెల్లి సర్పంచ్ చల్ల శ్రీనివాసరెడ్డితో పాటు నూతన కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ చెమటోర్చి సంపాదించిన దాంట్లో పదిమందికి సాయం చేయాలనే ఆలోచన రెడ్డి సామాజిక వర్గంలో ఉండటం అభినందనీయమన్నారు.వ్యవసాయ రంగంతో పాటు రాజకీయ, సామాజిక రంగాల్లోనూ రెడ్డి కులస్తులు ముందంజలో ఉంటున్నారని పేర్కొన్నారు. తన రాజకీయ ప్రస్థానం మొద టినుంచే ఎంతోమంది రెడ్డి స్నేహితులు తన కు అండగా నిలిచారని, వివిధ సందర్భాల్లో వారు అందించిన సహకారం మరువలేనిదని గుర్తుచేశారు. మండల కేంద్రంలో రెడ్డి సం ఘానికి సొంత భవనం ఉండాలనే ఆకాంక్షను నెరవేర్చేందుకు స్థలం కేటాయింపునకు కృషి చేస్తానని, భవన నిర్మాణానికి సహకారం అందిస్తానన్నారు. ఇప్పటికే నియోజకవర్గ పరి ధిలో పలువురు రెడ్డి కులస్తులకు నామినేటెడ్ పదవులు కల్పించినట్లు తెలిపారు. రైతు సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తోందన్నారు. రూ.2 లక్షల వరకు రైతు రుణమాఫీ చేసిన ఘనత తమ ప్రభుత్వానిదన్నారు. గత ప్రభుత్వ హ యాంలో రాష్ట్రం అప్పుల భారంలో కూరుకు పోయిందని విమర్శించారు. కార్యక్రమంలో మైత్రీ గ్రూప్ చైర్మన్ కొత్త జైపాల్‌రెడ్డి, మాజీ డీసీఎంఎస్ చైర్మన్ ముదుగంటి సురేందర్‌రె డ్డి,అల్ఫోర్స్ విద్యాసంస్థల చైర్మన్ నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే ముచ్చిడి మోహన్‌రెడ్డి, రాష్ట్ర రెడ్డి సంఘం అధ్యక్షుడు ఏనుగు సంతోష్‌రెడ్డి, జిల్లా రెడ్డి సంఘం అధ్యక్షుడు గుండారపు కృష్ణారెడ్డి, కోరెం సింగిల్‌విండో చైర్మన్ వన్నెల మమత రమణారెడ్డి, సర్పంచులు చింతలప ల్లి కవిత వెంకట్‌రెడ్డి, నిమ్మ భాగ్యలక్ష్మి శ్రీని వాసరెడ్డి, ఉప సర్పంచులు ఎర్రగడ్డ స్వామి రెడ్డి, కందుల గంగారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు డబ్బు తిరుపతిరెడ్డి, నాయకుడు సంధి తిరు పతిరెడ్డి, ఏఎంసీ మాజీ వైస్‌చైర్మన్ నిమ్మ వినోద్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. కాగా నూతనంగా ఏర్పాటైన రెడ్డి సంఘం ఉపాధ్యక్షులుగా గుడి శ్రీనివాస్‌రెడ్డి, ముచ్చ శ్రీనివాస్ రెడ్డి, మానేరు లక్ష్మారెడ్డి, ముచ్చ శేఖర్‌రెడ్డి, కార్యదర్శిగా మిట్టపల్లి శ్రీనివాస్‌రెడ్డి, సంయుక్త కార్యదర్శులుగా పాశం నారాయణరెడ్డి, కంక ణాల పురుషోత్తంరెడ్డి, ధ్యావ నరేందర్‌రెడ్డి, గోలి శ్రీనివాస్‌రెడ్డి, కోశాధికారిగా డబ్బు వెంక ట్‌రెడ్డి తదితరులు బాధ్యతలు స్వీకరించారు.