భూసేకరణ పనులు వేగవంతం చేయాలి
ABN , Publish Date - Jun 11 , 2026 | 12:29 AM
జిల్లాలోని వివిధ నీటి పారుదల ప్రాజెక్టు లు, రైల్వేలైన్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, జూన్ 10 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలోని వివిధ నీటి పారుదల ప్రాజెక్టు లు, రైల్వేలైన్ నిర్మాణం కోసం భూసేకరణ పనులు వేగవంతం చేయాలని కలె క్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి జిల్లాలోని వివిధ నీటి పారుదల ప్రాజెక్టులు, రైల్వేలైన్ నిర్మాణం, వీటీఏడీఏ తదితర అంశాలపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రాజెక్టుల కోసం భూసేకరణ పనులు గవంతంగా పూర్తిచేయాలని ఆదేశించారు. అధికారు లు సమన్వయంతో ప్రణాళిక ప్రకారం ముందుకు వెళ్లాలన్నారు. కాళేశ్వరం ప్రా జెక్టు, శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు, ఇతర ప్రాజెక్టులు, రైల్వే లైన్ నిర్మాణం, వీటీఏ డీఏ తదితర నిర్మాణాలు, ప్రస్తుత పరిస్థితిపై ఆరా తీశారు. సమావేశంలో జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌బా బు, కేఎస్ బీ కుమారి, ఇన్‌స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీనివాస్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్, నీటి పారుదల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.