Share News

భూసేకరణ వేగవంతం చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:02 AM

పెండింగ్‌ భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు.

 భూసేకరణ వేగవంతం చేయాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న కలెక్టర్‌, అధికారులు

కరీంనగర్‌, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి, ప్రతినిధి): పెండింగ్‌ భూసేకరణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటి పారుదల శాఖమంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఇరిగేషన్‌ ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ భూసేకరణపై జిల్లా కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కలెక్టర్‌ కార్యాలయంలో జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నీటి పారుదల ప్రాజెక్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్‌ భూసేకరణ పూర్తి చేయాల్సిన అవసరం ఉందన్నారు. పెండింగ్‌ భూసేకరణ కోసం ప్రభుత్వం వెంటనే 2,800 కోట్లు ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్‌ భూసేకరణ, పునవావాస పనుల ను వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లించాలన్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్‌ చిత్రా మిశ్రా మాట్లాడుతూ జిల్లాలో వివిధ ప్రాజెక్టులకు సబంధించిన పెండింగ్‌ భూ సేకరణ పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రణాళిక ప్రకారం పనులు పూర్తి చేయాలన్నారు. ఏ ప్రాజెక్టుకు సంబంధించి భూ సేకరణ చేపట్టవలసి ఉంది, ఎప్పుడు పూర్తవుతాయి అన్న వివరాలు అడిగి తెలుసకున్నారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ రెవెన్యూ శ్రీనివాస్‌రెడ్డి, ఆర్డీవో షర్మిల, ఎస్డీసీ రాజేశ్వరి, ఇరిగేషన్‌ అధికారులు, భూసేకరణ విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:02 AM