Share News

వేగవంతంగా భూసేకరణ పూర్తి చేయాలి

ABN , Publish Date - Aug 22 , 2026 | 12:16 AM

రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు.

వేగవంతంగా భూసేకరణ పూర్తి చేయాలి

సిరిసిల్ల, ఆగస్టు 21 (ఆంధ్రజ్యోతి) : రాష్ట్రంలో నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌లో ఉన్న భూ సేకరణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి కలెక్టర్లను ఆదేశించారు. శుక్రవారం హైదరాబాద్‌ నుంచి నీటి పారుదల ప్రాజెక్టుల పరిధిలో పెండింగ్‌ భూ సేకరణపై అన్ని జిల్లాల కలెక్టర్లు, నీటి పారుదల శాఖ అధికారులతో వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యాల యాల సముదాయం నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నీటిపారుదల ప్రాజె క్టుల పనులు సకాలంలో పూర్తయ్యేందుకు పెండింగ్‌ భూసేకరణను పూర్తిచేయాల్సిన అవసరం ఉందని తెలి పారు. పెండింగ్‌భూసేకరణ కోసం ప్రభుత్వం రూ.2800 కోట్లు విడుదల చేసిందని పేర్కొన్నారు. కొత్త ఆయకట్టు సృష్టించేందుకు వీలుగా పెండింగ్‌ భూసేకరణ, పునరావాస పను లను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. భూసేకరణకు అవసరమైన నిధులు అందుబాటులో ఉన్నందున ఎక్క డా జాప్యం లేకుండా ప్రక్రియను పూర్తి చేసి ప్రాజెక్టుల పనులకు ఎలాంటి ఆటం కం కలగకుండా చర్యలు తీసు కోవాలని సూచించారు. నిర్వాసితులకు నిబంధనల ప్రకారం పరిహారం చెల్లిం చాలని ఆదేశించారు.

పనులు పూర్తి చేయాలి : కలెక్టర్‌

జిల్లాలో శ్రీపాద ఎల్లంపల్లి, మిడ్‌ మానేరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్‌ భూ సేకరణ పనులు పూర్తి చేయాలని కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదే శించారు. ఈ మేరకు అధికారులు ప్రణాళిక ప్రకారం ఆయా పనులు పూర్తిచేయాలని సూచించారు. వీడియో కాన్ఫరెన్స్‌ ఆర్డీవోలు శ్రీధర్‌బాబు, కేఎస్‌బీ కుమారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్‌, ఎస్‌డీసీ శ్రీని వాస్‌, ఇరిగేషన్‌ అధికారి ప్రశాంత్‌, కలెక్టరేట్‌ పర్యవేక్ష కులు శ్రీకాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Aug 22 , 2026 | 12:16 AM