భూసేకరణ, ఆర్‌అండ్‌ఆర్ పనులు వేగవంతం
ABN , Publish Date - Sep 22 , 2026 | 01:21 AM
రాష్ట్రంలోని నీటిపా రుదల ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 21(ఆంరఽధజ్యోతి): రాష్ట్రంలోని నీటిపా రుదల ప్రాజెక్టులకు భూసేకరణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనులను వేగవంతం చేయాలని రాష్ట్ర నీటిపారు దల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి ఆదేశించారు. రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులకు సంబంధించిన పెండింగ్ భూసేకర ణ, అటవీ భూముల పరిహారం, ఆర్‌అండ్‌ఆర్ పనుల పురోగ తిపై రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి సంజయ్ జాజు సోమవారం హైదరాబాద్ నుంచి కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ గరిమ అగ్రవాల్ హాజరయ్యారు.ఈసందర్భంగా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలోని నీటిపారుదల ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ, అటవీ భూముల పరి హారం, ఆర్‌అండ్‌ఆర్ పనులకు అవసరమైన నిధులను పూర్తి స్థాయిలో విడుదల చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంగీకరించారని తెలిపారు. 2026-27 ఆర్థిక సంవత్సరంలో భూసేకరణకు రూ.6వేల కోట్ల వరకు ప్రభుత్వం నిధులు విడు దల చేయనున్నట్లు తెలిపారు. కలెక్టర్లు భూసేకరణ పరిహారం నిర్వాసితులకు పంపిణీ చేయాలని ఆదేశించారు. భూసేకరణ పనులకు ప్రత్యేక అధికారులను నియమించి బాధ్యతలు అప్ప గించాలని, ఈ అంశాన్ని అత్యంత ప్రాధాన్యతతో తీసుకొని పనులను పూర్తి చేయాలని స్పష్టం చేశారు.నీటిపారుదల శాఖ చీఫ్ ఇంజినీర్లు రెవెన్యూ అధికారులతో నిరంతరం సమన్వ యం చేసుకుంటూ భూసేకరణ పురోగతిని ప్రభుత్వానికి ఎప్ప టికప్పుడు తెలియజేయాలని ఆదేశించారు. ఇప్పటికే విడుదలై న రూ.2550 కోట్లను పూర్తిగా వినియోగించిన అనంతరం అవసరాన్నిబట్టి అదనపు నిధులు విడుదల చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. భూసేకరణ నిబంధనల ప్రకారం జరగాలని ఆదేశించారు. ఏవైనా సమస్యలు ఎదురైతే హైదరాబాద్‌లోని భూసేక రణ కమిషనర్ దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరిం చుకోవాలని సూచించారు.రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ ఇప్పటికే అవార్డులు జారీ చేసి న భూములకు సంబంధించిన పరిహారం చెల్లింపులను మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేయాలని ఆదేశించారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు భూసేకర ణ, ఆర్‌అండ్‌ఆర్ పనులకు సంబంధించి సుమారు రూ 3100 కోట్ల విలువైన పనులు గుర్తించగా, రూ2514 కోట్ల మేర నిధులు విడుదలచేసినట్లు తెలిపారు. పరిహారం నేరుగా రైతు లకు చేరేలా కలెక్టర్లు చర్యలు తీసుకుని భూసేకరణ ప్రక్రియ ను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని సూచించారు. ఎల్ నినో నేపథ్యంలో రానున్న సీజన్లో రైతులు ప్రత్యామ్నాయ పం టలు సాగు చేసేలా అవగాహన కల్పించాలని ఆదేశించారు. జిల్లా అటవీ శాఖ అధికారి సత్యనారాయణ, ఆర్డీఓలు శ్రీధర్ బాబు, కేఎస్‌బీ కుమారి, జిల్లా నీటి పారుదల శాఖ అధికారి దయాకర్, కలెక్టరేట్ పర్యవేక్షకులు శ్రీకాంత్ పాల్గొన్నారు.