జాతరకు ముస్తాబైన లక్ష్మీనర్సింహస్వామి ఆలయం
ABN , Publish Date - Nov 22 , 2026 | 11:47 PM
రుద్రంగి మండల కేంద్రం లోని ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆలయం ముస్తాబైంది.
రుద్రంగి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి) : రుద్రంగి మండల కేంద్రం లోని ప్రహ్లాద పర్వతంపై వెలసిన శ్రీలక్ష్మీనర్సింహస్వామి జాతరకు ఆలయం ముస్తాబైంది. ఈనెల 23 సోమవారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. 23వ తేది సాయంత్రం 6.30 గంట లకు లక్ష్మీనర్సింహస్వామి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారికి పట్టువస్త్రాలు, తలంబాలను ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్, సర్పంచ్ గండి నారాయణ, ఆలయ కమిటీ చైర్మన్ సామ మోహన్‌రెడ్డి సమర్పిం చనున్నారు. 24న మంగళవారం తీరునాళ్లు(జాతర) భక్తులకు మహా అన్నదానం, మధ్యాహ్నం గరుడ సేవా, సాయంత్రం నిత్య వైష్ణవు లతో యాక్షజ్ఞానం కార్యక్రమాలను చేపట్టనున్నారు. 25న బుధవారం రథోత్సవం నిర్వహించనున్నారు. మహోత్సవానికి జగిత్యాల, నిజా మాబాద్, నిర్మల్, కరీంనగర్, తదితర జీల్లాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి స్వామి వారికి కోరమీసాలు, పట్టె నామాలు సమర్పించి మొక్కులు చెల్లించుకోనున్నారు. జాతరలో భక్తుల సౌకర్యార్థం చలువపందిళ్లు, తాగునీరు, లైటింగ్ ఏర్పాటు చేశారు. రంగురంగుల విద్యుద్దీపాల అలంకరణతో ఆలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు.
జాతరకు ఏర్పాట్లు పూర్తి..
- సామ మోహన్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్
రుద్రంగిలో ప్రహ్లాద పర్వతంపై వెల సిన శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతరకు వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను పూర్తిచే శాం. వివిధ జిల్లాల నుంచి తరలివచ్చే భక్తుల కోసం చలువపం దిళ్లను, తాగునీటి సౌకర్యాలను ఏర్పాటు చేశాం. జాతరకు వచ్చే భక్తుల కోసం మంగళవారం అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశాం. ఉత్సవా ల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేశాం.