Share News

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జాతర

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:16 AM

కథలాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : కథలాపూర్‌ మండలం పెగ్గెర్లలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ఘనంగా జరిగింది. చుట్టు పక్కన ఉన్న ఊట్‌పల్లి, భూషణరావుపేట, చింతకుంట, కథలాపూర్‌ గ్రామాల నుంచి భక్తజనం వందలాదిగా తరలివచ్చి పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం జనం బారులు తీరారు. వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించారు.

ఘనంగా లక్ష్మీనరసింహస్వామి జాతర
పెగ్గెర్లలో కల్యాణంలో పాల్గొన్న విప్‌ ఆది శ్రీనివాస్‌

కథలాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి) : కథలాపూర్‌ మండలం పెగ్గెర్లలో గురువారం శ్రీలక్ష్మీనరసింహస్వామి జాతర ఘనంగా జరిగింది. చుట్టు పక్కన ఉన్న ఊట్‌పల్లి, భూషణరావుపేట, చింతకుంట, కథలాపూర్‌ గ్రామాల నుంచి భక్తజనం వందలాదిగా తరలివచ్చి పూజలు చేశారు. స్వామివారి దర్శనం కోసం జనం బారులు తీరారు. వేద పండితులు శాస్త్రోక్తంగా స్వామివారి కళ్యాణం నిర్వహించగా భక్తులు కనులారా వీక్షించారు. కళ్యాణ మహోత్సవంలో వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎమ్మెల్యేకు స్థానికులు ఘన స్వాగతం పలికి శాలువాతో సత్కరించారు. భక్తులకు నిర్వాహకులు అన్నదానం చేశారు. అదేవిధంగా తుర్తిలోని పాత హన్మాన్‌ దేవాలయ వార్షికోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్‌ పూండ్ర నారాయణరెడ్డి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు కాయితి నాగరాజు, బ్లాక్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు అజీం, ఏఎంసీ డైరెక్టర్‌ కారపు గంగాధర్‌, సర్పంచ్‌ కుంటాల లక్ష్మీనరేశ్‌, కాంగ్రెస్‌ నాయకులు, గ్రామపెద్దలు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:16 AM