Kumram Bheem Asifabad: రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా విద్యార్థులు
ABN , Publish Date - Nov 02 , 2026 | 11:24 PM
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలోని సన్ ఫ్లవర్ వేదిక్ పాఠశాలలో అక్టోబరు 29 నుంచి 31వతేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని కలెక్టర్ కె హరిత అన్నారు.
ఆసిఫాబాద్‌రూరల్, నవంబరు 2 (ఆంధ్రజ్యోతి): మేడ్చల్ జిల్లాలోని సన్ ఫ్లవర్ వేదిక్ పాఠశాలలో అక్టోబరు 29 నుంచి 31వతేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా ఫుట్‌బాల్ జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచిందని కలెక్టర్ కె హరిత అన్నారు. సోమవారం కలెక్టరే ట్‌లో జిల్లా జట్టు సభ్యులను ఆమె అభినందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడ రేషన్ అండర్-14 బాలుర ఫుట్‌బాల్ పోటీలలో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయిలో 2వ స్థానం సాధించిందని తెలిపారు. ఇదే స్ఫూర్తితో భవి ష్యత్‌లో మరింతగా రాణించాలని ఆకాంక్షిం చారు. కార్యక్రమంలో జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి తిరుపతి, డీఈవో కార్యాలయ సూపరింటెండెంట్ శ్రీనివాస్, జిల్లా జట్టు మేనేజర్ రమేష్, జట్టు కోచ్ రాజశేఖర్, ఖేలో ఇండియా కోచ్ కడతాల రాకేష్, పీడీలు విద్యాసాగర్, ప్రవీణ్, ప్రభాకర్, చిరంజీవి తదితరులు పాల్గొన్నారు.