సిరిసిల్ల సభతో కేటీఆర్ పతనం మొదలు
ABN , Publish Date - Sep 23 , 2026 | 12:50 AM
కేటీఆర్ పతనం ఈనెల 30 నుంచి మొదలు కాబోతుందని, రేవంత్‌రెడ్డి సభ సిరిసిల్లలో ఉం దంటే కేటీఆర్ వెన్నులో వణుకు పడుతుందని, సిరిసిల్లలో లక్ష మందితో నిర్వహించే సీఎం భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు.
సిరిసిల్ల, సెప్టెంబరు 22 (ఆంధ్రజ్యోతి) : కేటీఆర్ పతనం ఈనెల 30 నుంచి మొదలు కాబోతుందని, రేవంత్‌రెడ్డి సభ సిరిసిల్లలో ఉం దంటే కేటీఆర్ వెన్నులో వణుకు పడుతుందని, సిరిసిల్లలో లక్ష మందితో నిర్వహించే సీఎం భారీ బహిరంగ సభను ప్రజలు విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్లలోని కే కన్వె న్షన్ హాల్లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సభ సన్నాహక సమావేశం కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్య క్షుడు సంగీతం శ్రీనివాస్ అధ్యక్షతన జరిగింది. సమావేశంలో సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయంలు పాల్గొన్నా రు. ప్రభుత్వ విప్ మాట్లాడుతూ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వా త చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించడంతో పాటు భవిష్యత్‌లో ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యాన్ని కొనసాగించా లనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ఈ సభను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సిరిసిల్లలో రేవంత్‌రెడ్డి సభ ప్రకటనతో బీఆర్‌ఎస్‌లో ఆందో ళన మొదలైందన్నారు. గత పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో సిరిసిల్ల చేనేత రంగానికి, వేముల వాడ రాజన్న ఆలయ అభివృద్ధికి, సాగునీటి ప్రాజెక్టులకు, జిల్లా అభివృద్ధికి చేసిన కృషిపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్‌రెడ్డి సభతో సిరిసిల్లలో రాజకీయంగా కొత్త చర్చ ప్రారంభమవుతుందని, కేటీఆర్ రాజ కీయ పతనం సెప్టెంబర్ 30 నుంచి మొదలవు తుందని వ్యాఖ్యానించారు. కేటీఆర్, కేసీఆర్ రాజన్న సన్నిధికి వచ్చి గతంలో ఇచ్చిన హామీ లపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఫామ్‌హౌస్ సంస్కృతిని బీఆర్‌ఎస్ తీసుకొచ్చిందన్నారు. ఎర్రవెల్లి, రంగనా యకసాగర్, జన్వాడ తదితర ప్రాంతాల్లోని ఫామ్‌హౌస్‌ల అంశాన్ని ప్రస్తావించారు. 22ఏ భూముల అంశంలో పేదలకు న్యాయం చేయా ల్సిన అవసరం ఉందన్నారు. సిరిసిల్లలో భూము ల వ్యవహారంపై తమ వద్ద ఉన్న అంశాలను ప్రజల ముందుకు తీసుకు వస్తామని చెప్పారు. సభకు పెద్ద సంఖ్యలో ప్రజలను తరలించేలా సమావేశాలు ఏర్పాటు చేయాలన్నారు.
వస్త్ర పరిశ్రమకు రూ.300 కోట్ల బకాయిలు చెల్లించాం
సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రూ.300 కోట్లకు పైగా బకాయిలు మిగిలాయని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బకాయిలను చెల్లించడంతో పాటు నేత కార్మికులకు పని కల్పించే చర్యలు చేపట్టిందన్నారు. గత ఏడాది సుమారు 6.66 కోట్ల మీటర్ల చీరల ఆర్డర్లు ఇవ్వడంతో పాటు పాఠశాల యూనిఫామ్ లు తదితర ఆర్డర్ల ద్వారా పవర్‌లూమ్, చేనేత కార్మి కులకు ఉపాధి కల్పించా మని తెలిపారు. ప్రస్తుత సంవత్సరంలో ఇప్పటివర కు సుమారు 4.60 కోట్ల మీటర్ల చీరల ఉత్పత్తికి ఆర్డర్లు ఇచ్చినట్లు వివ రించారు. చేనేత కార్మికులకు సుమారు రూ 49 కోట్ల రుణమాఫీ చేసినట్లు తెలిపారు. వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధికి ఇప్పటివరకు సుమారు రూ.250కోట్ల మేర నిధులు వెచ్చిస్తున్న ట్లు పేర్కొంటూ, ఆలయ రూపురేఖలు మారేలా అభివృద్ధి పనులు కొనసా గుతున్నాయని వివరించా రు. కలికోట సూరమ్మ ప్రాజెక్టు భూసేకరణకు కాంగ్రెస్ ప్రభుత్వం రూ 80 కోట్లు విడుదల చేసి పనులను ముందుకు తీ సుకెళ్తోందని తెలిపారు. అలాగే రాజన్న సిరిసిల్ల జిల్లాలో ప్రస్తుతం సుమారు రూ.వెయ్యి కోట్ల మేర అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగుతున్నా యని, రేవంత్‌రెడ్డి పర్యటన సందర్భంగా జిలా ్లకు మరిన్ని అభివృద్ధి కార్యక్ర మాలను ప్రకటించే అవకాశం ఉందన్నారు. కాంగ్రెస్ జిల్లా అధ్యక్షు డు సంగీతం శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి కేకే మహేందర్‌రెడ్డి, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నాగుల సత్యనారాయ ణ, మాజీ ఎమ్మెల్యే కటకం మృత్యుంజయం మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ఏకకాలంలో రూ.2లక్షల వరకు రుణమాఫీ చేసి నట్లు తెలిపారు. ఈనెల30న జరిగే సభ విజయ వంతానికి గ్రామ స్థాయి నుంచే కార్యాచరణ ప్రారంభించాలని కాంగ్రెస్ నాయకులు సూచిం చారు. సమావేశంలో వేములవాడ మున్సిపల్ ఛైర్మన్ పుల్కం రాజు, టౌన్ క్లబ్ అధ్యక్షుడు చొప్పదండి ప్రకాష్, మార్కెట్ కమిటీ చైర్మన్ స్వరూపరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ గడ్డం నర్సయ్య, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఆడెపు చంద్రకళ, పద్మశాలి సంఘం జిల్లా కన్వీనర్ యెల్లే లక్ష్మీనారాయణ, కాంగ్రెస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు సూరదే వరాజు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ సురేందర్‌రెడ్డి,సీనియర్ నాయకులు చక్రఽ దర్‌రెడ్డి, రుక్మిణీ, కుమార్, బాలరాజు ఉన్నారు.