Share News

ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

ABN , Publish Date - Jul 25 , 2026 | 12:03 AM

బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీచౌక్‌ వద్ద ఘనంగా నిర్వహించారు.

ఘనంగా కేటీఆర్‌ జన్మదిన వేడుకలు

సిరిసిల్ల టౌన్‌, జూలై 24 (ఆంధ్ర జ్యోతి) : బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, సిరిసిల్ల ఎమ్మెల్యే కే తారకరామారావు జన్మదిన వేడుకలను బీఆర్‌ఎస్‌ పట్టణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం గాంధీచౌక్‌ వద్ద ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథులు నాఫ్స్‌కాబ్‌ చైర్మన్‌ కొండూరు రవీందర్‌, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళాచక్రపాణి కేక్‌ చేసి స్వీట్లను పంపిణీ చేశారు. అనంతరం కేటీఆర్‌ గిఫ్ట్‌ ఏ స్మైల్‌ లో భాగంగా జిల్లా ప్రభుత్వ ప్రధాన వైద్యశాలలో రోగులకు బ్రెడ్‌, పండ్లు, బాలింతలకు కేసీఆర్‌ కిట్లను అంద జేశారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీన్‌, సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, ప్రధాన కార్యదర్శి మ్యాన రవి తదితరులు పాల్గొన్నారు. సిరిసిల్ల బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో వేడుక లు నిర్వహించారు. అధ్యక్షుడు ఆవునూరి రమాకాంత్‌, మున్సిపల్‌ చైర్‌ప ర్సన్‌ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్‌ పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, నాయకుడు బొల్లి రామ్మోహన్‌, న్యాయవా దులు పాల్గొన్నారు.

Updated Date - Jul 25 , 2026 | 12:03 AM