ఆశావహులకు కేటీఆర్ బుజ్జగింపు
ABN , Publish Date - Jan 30 , 2026 | 01:00 AM
సిరిసిల్ల బల్దియాపై తిరిగి గులాబీ జెండా ఎగురవేసే దిశగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక దృష్టి పెట్టారు.
సిరిసిల్ల, జనవరి 29 (ఆంధ్రజ్యోతి) : సిరిసిల్ల బల్దియాపై తిరిగి గులాబీ జెండా ఎగురవేసే దిశగా బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసి డెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు ప్రత్యేక దృష్టి పెట్టారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలో 39 వార్డులు ఉండగా, ప్రతి వార్డులో ఆశావహులు ఎక్కువ సంఖ్యలోనే ముందుకు వచ్చారు. స్వయంగా కేటీఆర్ వారిని బుజ్జగిస్తూ అభ్యర్థులను ఖరారు చేశారు. గురు వారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్‌ల్లో మధ్యాహ్నం నుంచి రాత్రి వరకు వార్డుల వారీగా ఆశావహులను పిలిచి చర్చలు జరిపారు. వారికి అవకాశాలు కల్పించే దిశగా హామీ లు ఇచ్చినట్లు తెలిసింది. బీఆర్‌ఎస్ ముఖ్య నాయకులకు మున్సిపల్ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మార్గ నిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. కాంగ్రెస్ నుంచి 6వ వార్డు నాయకులు దూడం రజని శ్రీనివాస్ కేటీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. గులాబీ కండువా కప్పి రజని శ్రీనివాస్‌తో పాటు వారి అనుచరులను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఒకటోవ వార్డుకు చెందిన కాంగ్రెస్ నేత బూర బాలు పెద్ద సంఖ్యలో తన అనుచరు లతో కలిసి బీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఎన్నికల ఇన్‌చార్జి తుల ఉమ, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, టెస్కాబ్ మాజీ చైర్మన్ కొండూరు రవీందర్‌రావు, సెస్ చైర్మన్ చిక్కాల రామారావు రాష్ట్ర నాయకుడు చీటి నర్సింగరావు, బీఆర్‌ఎస్ పట్టణ ఆధ్యక్షుడు జిందం చక్రపాణి, జడ్పీ మాజీ వైస్‌చైర్మన్ సిద్ధం వేణుతో పాటు పలువురు నాయ కులు పాల్గొన్నారు.