Share News

కేటీఆర్‌.. నా జోలికి రావొద్దు..

ABN , Publish Date - Feb 05 , 2026 | 12:07 AM

తాను కార్యకర్తగా కష్టపడి పైకి వచ్చానని, బీజేపీ కార్యకర్తల కోసం లాఠీదెబ్బలు తిన్నా, జైలుకు వెళ్లానని, మరోసారి ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బం డారం బయటపెడతానని మాజీ మంత్రి కేటీఆర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు.

కేటీఆర్‌.. నా జోలికి రావొద్దు..

సిరిసిల్ల, ఫిబ్రవరి 4 (ఆంరఽధజ్యో తి) : తాను కార్యకర్తగా కష్టపడి పైకి వచ్చానని, బీజేపీ కార్యకర్తల కోసం లాఠీదెబ్బలు తిన్నా, జైలుకు వెళ్లానని, మరోసారి ఇక్కడికి వచ్చి ఇష్టమొచ్చినట్లు మాట్లాడితే నీ బం డారం బయటపెడతానని మాజీ మంత్రి కేటీఆర్‌ను కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ హెచ్చరించారు. బుధవారం సిరిసిల్ల, వేములవాడ మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇందులో భాగంగా సిరిసిల్లలో అంబేద్కర్‌ సర్కిల్‌ వద్ద నిర్వహించిన సభలో మాట్లాడుతూ కేటీఆర్‌ కంటే ప్రజలు తనకు ఎక్కువగా 2.26లక్షల ఓట్ల మెజారిటీతో గెలిపించారన్నారు. మొన్న వానలొ చ్చి పేదలు మునిగిపోతే వాళ్లను కాపాడేసోయి కేటీఆర్‌కు లేదని, తాను హెలికాప్టర్‌ తీసుకొచ్చి ముంపు బాధితులను కాపాడినట్లు తెలిపారు. కేంద్రం నుంచి నిధులు తెచ్చి ప్రజల కోసం కష్టపడుతుంటే.. కేటీఆర్‌ మాత్రం ఆ నిధులను దారి మళ్లించి కమీషన్లు తిన్నాడన్నారు. మోదీ ప్రభుత్వం 2లక్షల ఇళ్లకు పైసలిస్తే ఆనాడు కేసీ ఆర్‌ ప్రభుత్వం సిరిసిల్లలో ఒక్కరికి ఇల్లు ఇవ్వ లేదని నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలని చెబి తే తనపై కేసు పెట్టి జైలుకు పంపారని, ఇదేం దని అడిగిన బీజేపీ కార్యకర్తలను కొట్టి జైలుకు పంపించారన్నారు. బీఆర్‌ఎస్‌ కార్యకర్తలారా.. మీ కష్టాలను బీఆర్‌ఎస్‌ పట్టించుకోదు. ఎన్నిక ల్లో మిమ్ములను ఆదుకునే పరిస్థితి లేదని కష్ట మొస్తే ఆదుకునేది బీజేపీ తాను అండగా ఉం టానని, బీజేపీలోకి రండి అంటూ పిలుపునిచ్చా రు. ‘బీజేపీకి భయపడి కేసీఆర్‌ కొడుకు సిరిసి ల్లలోనే అడ్డాపెట్టి ఓటుకు రూ.10వేలు ఇస్తున్నా డట. ఆ డబ్బులు మనవే.. తీసుకోండి. ఓట్లు మాత్రం పువ్వు గుర్తుకు వేసి బీజేపీకి మున్సిప ల్‌ చైౖర్మన్‌ పీఠాన్ని అప్పగించండని కోరారు. సిరి సిల్ల మున్సిపల్‌ పీఠాన్ని బీఆర్‌ఎస్‌కు అప్పగిస్తే వానొస్తే గల్లీలన్నీ మునిగిపోతున్నాయని ఆఖరి కి కలెక్టరేట్‌ కూడా మునిగిపొయిందని, ట్రాక్టర్ల లో పోవాల్సిన దుస్థితి వచ్చిందన్నారు. వస్త్ర పరి శ్రమ సిరిసిల్లలో ఉంటే..యారన్‌ డిపోను వేము లవాడలో పెట్టారని, డిపో ఇక్కడ పెడితే వాళ్ల కమీషన్లు తెలుస్తాయని అక్కడ పెట్టారన్నారు. ప్రతి కిలో నూలుపై కాంగ్రెస్‌ నేతలు కమీషన్లు దొబ్బుతున్నారన్నారు.కాంగ్రెస్‌ రెండేళ్ల పాలనలో సిరిసిల్లలో ఒక్క అభివృద్ధి కార్యక్రమం చేయలే దని, సిమెంట్‌ రోడ్లు, మురికి కాలువలు లాంటి మౌలిక వసతులు కల్పనలో కాంగ్రెస్‌ విఫల మైందన్నారు. సుందరీకరణ పేరిట సిరిసిల్ల కొత్త చెరువును పూడిక తీయకుండా, మధ్యలో ఐలాండ్‌ నిర్మించి దాని నీటిలో సామర్థ్యాన్ని గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తగ్గించిందన్నారు. టెక్స్‌టైల్‌ పార్క్‌ పరిస్థితి దారుణంగా ఉందని, పరిశ్రమలు మూతపడ్డాయన్నారు. 220 యూని ట్లు నడవాల్సి ఉంటే ఇప్పుడు, 10 షెడ్లలో పని ఉందన్నారు. నేత కార్మికులకు ఉపాధి కల్పించ డంలో రెండు ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. ఏడు గ్రామాలను సిరిసిల్ల మున్సిపాలిటీలో విలీనం నుంచి తప్పించి మళ్లీ గ్రామ పంచాయతీలుగా చేస్తామని కాంగ్రెస్‌ నేతలు హామీ ఇచ్చిన విస్మరించారన్నారు. పదేళ్లలో విలీన గ్రామాల్లో మురికినీటి సమస్య రోడ్ల సమస్య ఎప్పటిలాగే ఉందని, ఇంటిపన్నులు ఇతర ట్యాక్స్‌లు పెంచారన్నారు. జిల్లా కేంద్రమైన సిరిసిల్ల పాత బస్టాండ్‌లో పార్కింగ్‌ స్థలం లేదని సిరిసిల్లలో ట్రా ఫిక్‌ సమస్యలు ఎదురవుతున్నాయన్నారు. సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేద న్నారు. మున్సిపల్‌లో కౌన్సిలర్ల అవినీతి కాంట్రాక్టర్ల అక్రమాలతో గత పాలన అవినీతిమ ఏమైందని అన్నారు. ఇప్పటి వరకు ఆర్ధిక సంఘం ద్వారా ప్రతి ఒక్కరికి దాదాపు రూ 29 కోట్లు ఇచ్చామని అమృ త్‌ పథకం ద్వారా రూ 50కోట్లు ఇచ్చామన్నారు. సక్రమంగా వినియోగించకుండా డబ్బులన్నీ వృథా చేస్తున్నారని, కమీషన్లు పంచుకుంటున్నారని పైప్‌ లైన్‌ పనులన్నీ ఎక్కడికక్కడ ఆగిపోయాయన్నారు. ప్రధానమంత్రి స్వనిధి ద్వారా సిరిసిల్ల పట్టణంలోని 11737మందికి చిన్నచిన్న వ్యాపారాలు చేసుకునేం దుకు రూ.21.52 కోట్ల ఇచ్చామని, స్వచ్ఛ భారత్‌ ద్వారా రూ.44 లక్షలు ఇచ్చామని, సిరిసిల్లకు వరద ల లెక్క కేంద్రం నిధులు తీసుకొస్తే...సిరిసిల్లను వరదల్లో ముంచుతున్నారన్నారు. నిధులు ఇచ్చేది కేంద్రం.. తెచ్చేది నేనే.. మీరు సిరిసిల్ల మున్సిపాలిటీ ని బీజేపీకి అప్పగిస్తే... పెద్ద ఎత్తున నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారని అన్నారు. మహిళలకు రూ 2500, తులం బంగారం, స్కూటీ ఇచ్చారా, అవ్వాతా తలకు రూ 4 వేల పెన్షన్‌ ఇచ్చారా అన్నారు. ఇవ్వ డానికి కాంగ్రెస్‌ దగ్గర పైసలున్నయా? నన్ను కోసి నా నయాపైసా ప్రభుత్వం వద్ద లేదని సీఎం రేవం త్‌రెడ్డే చెప్పిండు. ఎక్కడి నుండి నిధులు తీసుకొచ్చి అభివృద్ది చేస్తారని, నిధులు ఇచ్చేది కేంద్రం.. సిరి సిల్ల మున్సిపాలిటీని బీజేపీకి అప్పగిస్తే... పెద్ద ఎత్తు న నిధులిస్తానని మోదీ భరోసా ఇచ్చారని అన్నారు. కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి, రాష్ట్ర అధికార ప్రతినిధి జె సంగప్ప, సిరిసిల్ల ఇన్‌చార్జిమీసాల చంద్రయ్య, పట్టణ ఆధ్యక్షుడు శ్రీ కాంత్‌, మాజీ మున్సిపల్‌ చైర్మన్‌ రవీందర్‌, బీజేపీ అభ్యర్థులు పాల్గొన్నారు.

Updated Date - Feb 05 , 2026 | 12:07 AM