వైభవంగా కృష్ణాష్టమి వేడుకలు
ABN , Publish Date - Sep 05 , 2026 | 12:47 AM
జిల్లా కేంద్రంలో శుక్రవా రం అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి.
సిరిసిల్ల టౌన్, సెప్టెంబరు 4 (ఆంద్రజ్యోతి) : జిల్లా కేంద్రంలో శుక్రవా రం అంగరంగ వైభవంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు జరిగాయి. స్థానిక కల్యాణలక్ష్మి గార్డెన్స్‌లో ఇస్కాన్ కృష్ణ చైతన్య సంఘం ఆధ్వర్యంలో వేడుకల ను నిర్వహించారు. ముఖ్యఅతిథులుగా నాఫ్‌కాబ్ చైర్మన్ కొండూరు రవీంద ర్‌రావు, సిరిసిల్ల మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళాచక్రపాణి, బీఆర్‌ఎస్ సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి హాజరై స్వామివారిని దర్శిం చుకున్నారు. ఉదయం స్వామి వారికి అభిషేకాలు, ఆధ్యాత్మిక ప్రవచనాలు, భక్తుల హరినామ కీర్తలనలతో కల్యాణలక్ష్మి గార్డెన్ ఆధ్యాత్మికత శోభ సంత రించుకుంది. అనంతరం స్వామి వారికి ఉయ్యాల సేవా, 56 రకాల నైవేద్యా లు, సాంస్కృతిక కార్యక్రమాలు, అన్నప్రసాద వితరణలు జరిగాయి. స్థానిక శ్రీకృష్ణవేణి టాలెంట్ హైస్కూల్, సెలెస్టియన్ హైస్కూల్, శ్రీసరస్వతీ శుభో దయం హైస్కూల్‌లో వేడుకలు నిర్వహించారు. కొత్త బస్టాండ్‌లో యాదవ సంఘం ఆధ్వర్యంలో వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో ఇస్కాన్ కృష్ణ చైతన్య సంఘం సభ్యులు ప్రాణనాథ అచ్యుతదాసు ప్రభు, జి రాకల గోపేశ్వర్‌దాసు ప్రభు, కన్నయ్య ప్రభు, రమేష్ ప్రభు, కరస్పాండెంట్‌లు రాజురెడ్డి, బుర్ర రాధకృష్ణప్రసాద్, శ్రీనివాస్‌యాదవ్, ఉపాధ్యాయులు తది తరులు పాల్గొన్నారు.