Share News

ఘనంగా ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ

ABN , Publish Date - Nov 28 , 2026 | 11:55 PM

దేశమంతటా తెలంగాణ పేరు మారుమోగేలా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2026ను గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు.

ఘనంగా ఖేలో ఇండియా క్రీడా పోటీల నిర్వహణ

సిరిసిల్ల, నవంబరు 28 (ఆంధ్రజ్యోతి): దేశమంతటా తెలంగాణ పేరు మారుమోగేలా ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌-2026ను గొప్పగా నిర్వహించాలని రాష్ట్ర క్రీడల శాఖ మంత్రి వాకిటి శ్రీహరి ఆదేశించారు. శని వారం హైదరాబాద్‌ నుంచి ప్రభుత్వ సలహాదారు జితేందర్‌రెడ్డి, యువజనాభివృద్ధి, పర్యాటక, సాంస్కృతిక శాఖ ప్రత్యేక ప్రధానకార్యదర్శి ఎ వాణీప్రసాద్‌, స్పోర్ట్స్‌ అథారిటీ ఆఫ్‌ తెలంగాణ వైస్‌ చైర్మన్‌ సోని బాలాదేవి తదితరులతో కలిసి ఖేలో ఇండియా యూత్‌ గేమ్స్‌ నిర్వహణ ఏర్పాట్లపై మంత్రి వాకిటి శ్రీహరి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాజేంద్ర సిరిసిల్ల జిల్లా సమీకృత కార్యా లయాల సముదాయం నుంచి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ ఖేలో ఇండియా పోటీలకు తెలంగాణ ఆతిథ్యం ఇవ్వడం ఎంతో గర్వకారణమని, అన్ని స్థాయి లలో అధికారులు సమన్వయంతో ఘనంగా నిర్వహించి, భవిష్యత్తులో ఒలింపిక్స్‌ స్థాయి అంతర్జాతీయ పోటీల నిర్వహణకు ఖేలో ఇండియా పోటీలను వేదికగా మల చుకోవాలని అన్నారు. పోటీలలో భాగంగా ప్రతిష్టాత్మ కంగా చేపట్టనున్న టార్స్‌ ర్యాలీని ప్రతి జిల్లాలో విజయ వంతంగా కొనసాగేలా చర్యలు తీసుకోవాలని సూచిం చారు. ఈ కార్యక్రమానికి విస్తృత ప్రచారం కల్పించా లని, ప్రతి ఒక్కరికీ ఖేలో ఇండియా క్రీడా పోటీలపై తెలిసేలా కృషి చేయాలన్నారు. క్రీడా పోటీలు జరిగే వేదికలకు విద్యార్థులను ప్రభుత్వం ఇప్పటికే వారికి అందజేసిన స్పోర్స్ట్‌యూనిఫాంలతో తరలించి వారు క్రీడలను తిలకించేలా చర్యలు తీసుకోవాలన్నారు. దీని వల్ల క్రీడల ప్రాముఖ్యతను విద్యార్థులు స్ఫూర్తి పొందు తారని పేర్కొన్నారు.

యువతను, ప్రజాప్రతినిధులను కూడా భాగస్వా ములు చేయాలని సూచించారు. మౌలిక సదుపాయాల కల్పన, క్రీడా సామగ్రి విషయంలో రాజీ పడకూడదని, అదే సమయంలో క్రీడాకారులు, వారి వెంట వచ్చే సపోర్టింగ్‌ స్టాఫ్‌ భద్రత, వసతి, భోజనం సౌకర్యాల కల్పనలో లోటు ఉండకుండా పక్కాగా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. క్రీడా వేదికలను క్షేత్రస్థాయిలో సందర్శించి, అన్ని సదుపాయాలు అందుబాటులో ఉండేలా సిద్ధంచేయాలన్నారు.

సజావుగా ఏర్పాట్లు..

యువజనాభివృద్ధి, పర్యాటక, సాం స్కృతిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యద ర్శి ఎ వాణీప్రసాద్‌ మాట్లాడుతూ ఖేలో ఇండియా పోటీలను అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తూ, సజావుగా జరిగేలా అవసరమైన ఏర్పాట్లు చేప ట్టాలని సూచించారు. హైదరాబాద్‌తో పాటు ఖమ్మం, హన్మకొండ, కరీంన గర్‌, నిజామాబాద్‌, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో క్రీడా పోటీలు నిర్వహించనున్న నేపథ్యంలో అధికారులు అందరూ విజయవంతం చేయాలన్నారు. యువ తను క్రీడల వైపు మళ్లించేందుకు ఖేలో ఇండి యా కార్యక్రమాన్ని ముఖ్య సాధనంగా మలచుకోవా లనే ప్రభుత్వ ఆశయానికి అనుగుణంగా ఈ ఈవెంట్‌ ను పండుగ వాతావరణంలో నిర్వహించాలన్నారు. ప్రతి గురుకుల పాఠశాల, విద్యాసంస్థకు ఖేలో ఇండియా కార్యక్రమం గురించి తెలియజేయాలని, విద్యార్థులు, యువతను పెద్ద సంఖ్యలో భాగస్వాములను చేస్తూ టార్చ్‌ ర్యాలీలు నిర్వహించాలని సూచించారు. ఈ ర్యాలీల ద్వారా క్రీడలపై అవగాహన కల్పించి, యువత లో క్రీడా స్ఫూర్తిని పెంపొందించాలన్నారు.

వీడియో కాన్ఫరెన్స్‌లో జిల్లా రెవెన్యూ అధికారి జయ శ్రీ, డీవెఎస్‌ఓ రాందాస్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Nov 28 , 2026 | 11:55 PM