Share News

ఖరీఫ్‌ కొనుగోళ్లు ప్రణాళిక ప్రకారం పూర్తి

ABN , Publish Date - Sep 11 , 2026 | 12:58 AM

ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు.

ఖరీఫ్‌ కొనుగోళ్లు ప్రణాళిక ప్రకారం పూర్తి

సిరిసిల్ల, సెప్టెంబరు 10 (ఆంధ్రజ్యోతి) : ఖరీఫ్‌ సీజన్‌ ధాన్యం కొనుగోళ్ల కోసం ప్రణాళిక ప్రకారం ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ గరిమ అగ్రవాల్‌ ఆదేశించారు. గురువారం రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో ఖరీఫ్‌ సీజన్‌ 2026-27 ధాన్యం కొనుగోళ్ల కోసం చేయాల్సిన ఏర్పాట్లపై అదనపు కలెక్టర్‌ గడ్డం నగేష్‌తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వ్యవసాయ శాఖ అధికారుల అంచనా మేరకు దాదాపు 2.40లక్షల మెట్రిక్‌ టన్నుల సన్న, దొడ్డు రకం ధాన్యం కొనుగోలు చేసేందుకు ఏర్పాట్లు చేయాలని తెలిపారు. జిల్లాలో 236 కేంద్రాల్లో ఐకేపీ 136, పీఏసీఎస్‌ 96, డీసీఎంఎస్‌ ఒకటి, మెప్మా ఆద్వర్యంలో7 కేంద్రాలు ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయాలని సూచించారు. జిల్లాలో అక్టోబర్‌ చివరి వారం నుంచి వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారని తెలిపారు. లారీల కాంట్రాక్టర్లు తాము అగ్రిమెంట్‌ ప్రకారం వాహనాలు అందుబాటులో పెట్టేలా చూడాలని, అన్నిటికి జీపీఎస్‌ యంత్రాలు ఏర్పాటు చేసేలా చూడాలని రవాణా శాఖ అధికారులకు సూచించారు. జిల్లాలో కొత్త గన్ని సంచులు 1083500, పాత గన్ని సంచులు 2.60 లక్షలు ఉన్నాయని వెల్లడించారు. మిగతా కొనుగోళ్లకు అనుగుణంగా గన్ని సంచులు తెప్పిం చాలని సూచించారు. 4335 టార్పాలిన్లు, రెండు ఆటోమేటిక్‌ ప్యాడీ క్లీనరు, 270 గ్రైన్‌ కాలిపర్స్‌, 333 తేమ యంత్రాలు, 630 ఎలకా్ట్రనిక్‌ వేయింగ్‌ యంత్రాలు, 270 హస్క్‌ రిమూవర్లు, రెండు డ్రైయర్స్‌ ఉన్నాయని తెలిపారు. ఈ సమావేశంలో సిరిసిల్ల, వేములవాడ ఆర్డీవోలు శ్రీధర్‌ బాబు, కే ఎస్‌ బీ కుమారి, డీసీఎస్‌ఓ బుచ్చిబాబు, డీఎం గోపాల్‌, డీఆర్డీఓ లక్ష్మీనారాయణ, జిల్లా సహకార శాఖ అధికారి రామకృష్ణ, వ్యవసాయ శాఖ అధికారి అఫ్జల్‌ బేగం, జిల్లా మార్కెటింగ్‌ శాఖ అధికారి ప్రకాష్‌, మార్క్‌ఫెడ్‌ అధికారి హబీబ్‌, ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Sep 11 , 2026 | 12:59 AM