Share News

ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

ABN , Publish Date - Apr 23 , 2026 | 12:45 AM

ఇళ్ల పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు నిత్యయం తడి, పొడి చెత్తలను వేరుచేసి ట్రాక్టర్‌లకు ఇవ్వాలని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి కోరారు.

ఇళ్ల పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి

సిరిసిల్ల అర్బన్‌, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి) : ఇళ్ల పరిసరాల పరిశుభ్రంగా ఉంచుకోవడంతోపాటు నిత్యయం తడి, పొడి చెత్తలను వేరుచేసి ట్రాక్టర్‌లకు ఇవ్వాలని సిరిసిల్ల మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళా చక్రపాణి కోరారు. సిరి సిల్ల మున్సిపల్‌ పరిధిలోని 24వ వార్డు రాజీవ్‌నగర్‌లో బుధవారం పారిశుధ్య నిర్వహణ అవగాహన కార్యక్రమంలో భాగంగా వార్డు కౌన్సిలర్‌ బుర్ర మల్లికా ర్జున్‌గౌడ్‌ ఆధ్వర్యంలో రాజీవ్‌నగర్‌లో మున్సిపల్‌ అధికారులతో కలిసి చైర్‌పర్సన్‌ పర్యటించి పారిశుధ్య పనుల నిర్వహణ తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా చైర్‌పర్సన్‌ మాట్లాడుతూ ఇళ్ళలతోపాటు వ్యాపార సముదాయాల నుంచి ఉత్ప త్తి అయ్యే చెత్తను తడి చెత్త, పొడి చెత్త, హానికరమైన చెత్తలుగా వేరుచేసి మున్సిపల్‌ చెత్త సేకరణ వాహనాలకు అందించాలన్నారు. అదేవిధంగా మురుగు నీటి కాలువలో రోడ్లపై బహిరంగ ప్రదేశాల్లో చెత్త వెయ్యరాదన్నారు. ఇళ్ల పరిస రాలలో ఎక్కడ కూడా అనవసరపు నీటి నిలువలు లేకుండా చూసుకోవాల న్నారు. వాటర్‌ ట్యాంకులు, కూలర్లలో ఎప్పటికప్పుడు నీటిని మారుస్తూ శుభ్రం గా ఉంచుకోవాలని సూచించారు. అదేవిధంగా ఎండాకాలం దృష్ట్యా నీటిని అన వసరంగా వృథా చేయకుండా అవసరం మేరకు పొదుపుగా వాడుకోవాలని నీటి సమస్యలు ఏర్పడకుండా చేసుకోవాలని ప్రజలకు సూచించారు. అనంతరం ప్రజ లతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎండీ ఖాదిర్‌ ఫాషా, డీఈ వాణి, మాజీ కౌన్సిలర్‌ బుర్ర లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Apr 23 , 2026 | 12:45 AM