కార్యాలయాలను పరిశుభ్రంగా ఉంచాలి
ABN , Publish Date - Mar 10 , 2026 | 11:51 PM
ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు.
సిరిసిల్ల, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ప్రతి ప్రభుత్వ కార్యాలయంలోని నిరుపయోగ వస్తువులు, పరికరాలు తొలగించి పరిశుభ్రంగా ఉంచాలని కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. మంగళవారం ప్రజా పాలన-ప్ర గతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా కలెక్టరేట్‌లో స్వచ్ఛత.. పరిశుభ్రత కార్యక్రమాన్ని నిర్వహించగా కలెక్టర్ తనిఖీ చేశారు. కలెక్టరే ట్‌లోని నీటి పారుదల శాఖ, ఈఈ పీఆర్, ఆర్‌అండ్‌బీ, బీసీ సంక్షేమ శాఖ, డీటీ సీపీవో, కార్మికశాఖ, భూగర్భశాఖ, డీఆర్‌డీవో, మైనింగ్, సీపీ వో, వ్యవసాయ శాఖ, ఉద్యానవన శాఖ, సహకార శాఖ, ఎక్సైజ్, విద్యా శాఖ, వైద్య ఆరోగ్య శాఖ, పౌర సరఫరాల శాఖ, ఉపాధి కల్పన శాఖ, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, జిల్లా పంచాయతీరాజ్, ట్రెజరీ శాఖ, ఏవో ఆఫీస్, డీపీ ఆర్‌వో, సంక్షేమశాఖ తదితర కార్యాలయాలను అదనపు కలెక్టర్ గడ్డం నగేష్‌తో కలిసి తనిఖీ చేశారు. ఆయా కార్యాలయాల్లోని గదుల్లో ఉన్న ఫర్నిచర్, ఫైల్స్, రికార్డులు, సామగ్రి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రజాపాలన-ప్రగతి ప్రణాళిక 99రోజుల కార్యక్రమంలో భాగంగా ప్రతి జిల్లా శాఖ కార్యాల యం, మండలాల్లోని కార్యాలయాలు నిత్యం పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యాలయంలోని ఫైళ్లు, రిజిస్టర్లు స్టోర్‌రూమ్‌లు సిద్ధం చేయాలని, అనవసరమైనవి తొలగించాలని సూచిం చారు. కార్యాలయం ఆవరణలోని నిరుపయోగ వస్తువులు, ఎలకా్ట్రనిక్ పరి కరాలు తొలగించాలని ఆదేశించారు.