వచ్చే ఏడాది రాష్ట్రస్థాయిలో కేసీఆర్ క్రికెట్ కప్ పోటీలు
ABN , Publish Date - Apr 26 , 2026 | 12:34 AM
వచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయిలో బ్రహ్మాండంగా కేసీఆర్-కప్ క్రికెట్ పోటీలు నిర్వ హిస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు అన్నారు.
సిరిసిల్ల, ఏప్రిల్ 25 (ఆంధ్రజ్యోతి): వచ్చే ఏడాది అన్ని జిల్లాల్లో పోటీలు నిర్వహించి రాష్ట్రస్థాయిలో బ్రహ్మాండంగా కేసీఆర్-కప్ క్రికెట్ పోటీలు నిర్వ హిస్తామని బీఆర్‌ఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారక రామారావు అన్నారు. శనివారం జిల్లా కేంద్రంలోని బైపాస్ రోడ్డు మైదానం లో బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో కేసీఆర్ కప్-2026 క్రికెట్ పోటీల ముగింపు కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. జిల్లాస్థాయిలో నెలరోజులుగా మండలా ల నుంచి జిల్లా స్థాయి వరకు కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. కేసీఆర్ కప్-2026 కోసం 157జట్లు పోటీ పడ్డాయి.2512మంది క్రీడాకారులు పోటీల్లో పాల్గొన్నారు. ఫైనల్ సిరిసిల్ల డాల్ఫిన్ జట్టు విజేతగా నిలిచింది. వీరికి ట్రోఫీతో పాటు రూ.2 లక్షల నగదు అందించారు. మొదటి రన్నర్‌గా వేములవాడకు చెందిన కమాండర్ జట్టుకు ట్రోఫీతో పాటు రూ లక్ష నగదు, రెండో రన్నర్‌గా వేములవాడ రాయల్ జట్టుకు ట్రోఫీతోపాటు 50వేల నగదు అందించారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ క్రికెట్‌తో పాటు ఇతర క్రీడలను కూడా నిర్వహిస్తామన్నారు. వచ్చే దసరాకు వాలీబాల్, కబడ్డీ పోటీ లు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా2027 సంవత్సరంలో ఫిబ్రవరి 17న కేసీఆర్ జన్మదినం నుంచి ఏప్రిల్ 27న బీఆర్‌ఎస్ పుట్టినరోజు వరకు రెండు నెలలు పండుగ వాతావరణంలో కేసీఆర్ కప్ క్రికెట్ పోటీలు అన్ని జిల్లాల్లో నిర్వహించి అదేక్రమంలో రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తామన్నారు. 2028లో కేసీ ఆర్ ముఖ్యమంత్రి అవుతారని తర్వాత సిరిసిల్ల వైపు దేశం మొత్తం చూసే విధంగా క్రీడలు నిర్వహిస్తామన్నారు. నాస్కాబ్ చైర్మన్ కొండూరు రవీందర్ రావు, బీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య. సెస్ చైర్మన్ చిక్కాల రామ రావు, మాజీఎమ్మెల్యే సుంకె శంకర్, వేములవాడ బీఆర్‌ఎస్ ఇన్‌చార్జి చల్మెడ లక్ష్మీనర్సింహారావు, క్రీడా నిర్వాహకులు కొండూరు సాంకేత్, జడ్పీ మాజీ చైర్‌పర్సన్ అరుణ, మున్సిపల్ చైర్‌పర్సన్ జిందం కళా చక్రపాణి, వైస్‌చైర్మన్ సందీప్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, బీఆర్‌ఎస్ సీనియర్ నాయకులు మ్యాన రవి, బొల్లి రామ్మోహన్, మంచే శ్రీనివాస్, కుంభాల మల్లారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృ తిక కార్యక్రమాలు అలరించాయి. కళాకారి బృందం వివిధ పాటలతో ఆకట్టు కున్నారు. క్రీడాకారులు, యువకులు నృత్యాలు చేశారు.