Karimnagar: పడిపోతారు.. జాగ్రత్త
ABN , Publish Date - May 01 , 2026 | 12:11 AM
హుజూరాబాద్‌రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఓ బావి ప్రమాదకరంగా మారింది.
- ప్రమాదకరంగా పాడుబడ్డ బావి
- పట్టించుకోని అధికారులు, ప్రజాప్రతినిధులు
హుజూరాబాద్‌రూరల్, ఏప్రిల్ 30 (ఆంధ్రజ్యోతి): మండలంలోని పోతిరెడ్డిపేట గ్రామంలో ప్రధాన రహదారికి అనుకొని ఉన్న ఓ బావి ప్రమాదకరంగా మారింది. రోజురోజుకు కూలిపోతుండడంతో గ్రామస్తులు భయాందోళనలు వ్యక్తం చేసున్నారు. కొంచెం.. కొంచెం కూలుతూ సీసీ రోడ్డు కింద సగభాగం వరకు బావిలో కూలిపోయింది. ఎవరైనా తెలియని వారు వస్తే ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఎవరూ పట్టించుకోకపోవడంతో గ్రామస్థులు ఆందోళన చెందుతున్నారు. ఈ బావిని పూడ్చివేయాలని కలెక్టర్‌కు వినతిపత్రం అందించామని, ఇప్పటి వరకు ఎటువంటి స్పందన లేదని సర్పంచ్ సుమలత తెలిపారు. ఇప్పటికైనా స్పందించి బావి పూడ్చివేయించాలని ఆమె కోరారు.