Share News

Karimnagar: కాంగ్రెస్‌ పాలనలో మహిళల అభివృద్ధి

ABN , Publish Date - Mar 20 , 2026 | 12:29 AM

తిమ్మాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా పురోబివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు.

Karimnagar: కాంగ్రెస్‌ పాలనలో మహిళల అభివృద్ధి

- ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ

తిమ్మాపూర్‌, మార్చి 19 (ఆంధ్రజ్యోతి): కాంగ్రెస్‌ పాలనలో మహిళలు ఆర్థికంగా పురోబివృద్ధి సాధిస్తారని ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అన్నారు. గురువారం మండలంలోని మొగిళిపాలెం గ్రామంలో, రామకృష్ణ కాలనీ, నేదునూర్‌ గ్రామాలలో వీవో భవన నిర్మాణ పనులకు ఆయన భూమి పూజ చేశారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కోటి మంది మహిళలను కోటీశ్వరులుగా చేయడమే కాంగ్రెస్‌ ప్రభుత్వ లక్ష్యమని అందుకు అనుగుణంగానే ఎలాంటి వడ్డీ లేని రుణాలు బ్యాంకుల ద్వారా మహిళా సంఘాలకు అందిస్తుందన్నారు. మడ్డీలేని రుణాలు ఇస్తూ మహిళలను, మహిళా సంఘాలను ఆర్థికంగా బలోపేతం చేస్తున్నదని తెలిపారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మహిళల సంక్షేమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదని విమర్శించారు. అధికారంలోని వచ్చిన తరువాత కాంగ్రెస్‌ ప్రభుత్వం మహిళా సంఘం, వీవో భవన నిర్మాణాలను వేగవంతం చేసిందని ఎమ్మెల్యే అన్నారు. ఈ కార్యక్రమంలో ఆయ గ్రామల సర్పంచ్‌లు తాట్ల తిరుపతి, జి.శ్వేత, కనకం లక్ష్మి, మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు బండారు రమేష్‌, నాయకులు మామిడి అనిల్‌ కుమార్‌, గోగూరి నరసింహరెడ్డి, మోరపల్లి రమణా రెడ్డి, ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - Mar 20 , 2026 | 12:29 AM