Share News

Karimnagar: బ్రిడ్జి నిర్మాణానికి మోక్షమెప్పుడో..?

ABN , Publish Date - Jan 26 , 2026 | 12:05 AM

చిగురుమామిడి, జనవరి 25 (ఆంద్రజ్యోతి): మండలంలోని ఇందుర్తి ఎల్లమ్మ వాగుపై లోలెవల్‌ వంతెనతో కోహెడ, చిగురుమామిడి మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

Karimnagar:   బ్రిడ్జి నిర్మాణానికి మోక్షమెప్పుడో..?

- ఇందుర్తి ఎల్లమ్మ వాగుపై లో లెవల్‌ వంతెనతో ఇబ్బందులు

చిగురుమామిడి, జనవరి 25 (ఆంద్రజ్యోతి): మండలంలోని ఇందుర్తి ఎల్లమ్మ వాగుపై లోలెవల్‌ వంతెనతో కోహెడ, చిగురుమామిడి మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారులను, ప్రజాప్రతినిధులను ఎన్నిసార్లు కోరినా హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి మోక్షం కలగడం లేదు. వర్షాకాలంలో ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీంతో వాగుపై ఉన్న లోలెవల్‌ వంతెన మునిగిపోయి రాకపోకలు నిలిచిపోతాయి. ఈ వాగు మీదుగా కోహెడ- చిగురుమామిడి మండలాల ప్రజలు రాకపోకలు సాగిస్తుంటారు. వర్షా కాలం వచ్చిందంటే చాలు.. రెండు మండలాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుంటారు. వర్షాకాలంలో వాగు ఉృతంగా ప్రవాహిస్తున్నప్పుడు మంత్రి పొన్నం ప్రభాకర్‌ గౌడ్‌ సందర్శించి వాగుపై హైలెవల్‌ బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేస్తానని హామీ ఇచ్చారు. అది కార్యరూపం దాల్చలేదు. మంత్రి ప్రత్యేక చొరవ తీసుకుని బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మండల ప్రజలు కోరుతున్నారు.

Updated Date - Jan 26 , 2026 | 12:05 AM