Karimnagar: మున్సి‘పోల్స్’లో విజయకేతనం ఎగురవేస్తాం
ABN , Publish Date - Jan 22 , 2026 | 12:09 AM
హుజూరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గనిర్దేశనంలో విజయకేతనం ఎగరవేస్తామని
- బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి
హుజూరాబాద్, జనవరి 21 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని మున్సిపల్, కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్ మార్గనిర్దేశనంలో విజయకేతనం ఎగరవేస్తామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు గంగాడి కృష్ణారెడ్డి అన్నారు. బుధవారం హుజూరాబాద్ పట్టణంలో నితిన్ నబీన్ బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా ఎన్నికపై సంబరాలు నిర్వహించారు. బైక్ ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా గంగాడి కృష్ణారెడ్డి మాట్లాడుతూ నితిన్ నబీన్ 45 ఏళ్ల వయసులోనే బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారన్నారు. ఇది యువ నాయకత్వానికి గుర్తింపుగా భావిస్తున్నామన్నారు. నితిన్ నబీన్ నాయకత్వంలో యువనేతలకు, క్రియాశీల కార్యకర్తలకు భవిష్యత్తులో పెద్ద ఎత్తున అవకాశాలు ఉంటాయన్నారు. నీతి, నిజాయితీ, పట్టుదలతో పనిచేస్తే అవకాశం తప్పకుండా వస్తుందన్నారు. యువత మాత్రమే కాదు, ప్రతి కార్యకర్త కూడా బీజేపీలో ఎదగవచ్చన్నారు. కార్యక్రమంలో నాయకులు మహేష్, రాజు, ప్రభాకర్, శ్రీనివాస్, శశిధర్, సుమన్, రాజశేఖర్, సంజీవరెడ్డి, వెంకటేష్, వాసు, రమేష్ పాల్గొన్నారు.