Share News

Karimnagar: తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి

ABN , Publish Date - Jan 03 , 2026 | 11:17 PM

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, ఓటరు జాబితాను సవరణ చేసి తప్పులు లేకుండా తుదిజాబితాను రూపొందించాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు.

Karimnagar:   తప్పులు లేకుండా ఓటరు జాబితా రూపొందించాలి

- బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌

కరీంనగర్‌ టౌన్‌, జనవరి 3 (ఆంధ్రజ్యోతి): నగరపాలక సంస్థ పరిధిలోని 66 డివిజన్లకు సంబంధించిన ముసాయిదా ఓటరు జాబితా తప్పుల తడకగా ఉందని, ఓటరు జాబితాను సవరణ చేసి తప్పులు లేకుండా తుదిజాబితాను రూపొందించాలని బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు చల్ల హరిశంకర్‌ డిమాండ్‌ చేశారు. శనివారం బీఆర్‌ఎస్‌ నగర అధ్యక్షుడు హరిశంకర్‌ ఆధ్వర్యంలో మున్సిపల్‌ కమిషనర్‌ ప్రఫుల్‌దేశాయ్‌ని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా హరిశంకర్‌ మాట్లాడుతూ ఈనెల 1న ప్రచురించిన ముసా యిదా ఓటరు జాబితా పరిశీలించగా, అందులో అనేక లోపాలు, తప్పులు ఉన్నట్లుగా గుర్తించామన్నారు. ఈ లోపాల కారణంగా ఎన్నికల్లో పోటీచేయు అభ్యర్థిలో, ప్రజల్లో గందరగోళం ఏర్పడే అవకాశముందని అన్నారు. ఒకే ఇంటి నెంబరుకు సంబంధించిన అన్ని ఓటర్లు ఒకే చోట నమోదు చేయాలని, ప్రస్తుతం ఒకే ఇంటిలో నివసిస్తున్న కుటుంబసభ్యుల ఓటరు వివరాలు వేర్వేరు చోట్ల నమోదు కావడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని అన్నారు. ఇంటి నెంబర్లు లేకుండా కొందరు ఓటర్ల పేర్లు జాబితాలో చేర్చడం వల్ల వారి నివాస ప్రాంతాన్ని నిర్ధారించలేని పరిస్థితి ఉందన్నారు. లోపాలతో రూపొందించిన ముసాయిదా జాబితాను సరిదిద్దాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో నగర బీఆర్‌ఎస్‌ పార్టీ అధ్యక్షుడు మాజీ కార్పొరేటర్లు, డివిజన్‌ అధ్యక్షులు, ముఖ్యనాయకులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Jan 03 , 2026 | 11:17 PM