Share News

Karimnagar: వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకుర్పాణ

ABN , Publish Date - Jan 24 , 2026 | 11:30 PM

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఘనంగా అంకురార్పణ జరిగింది.

Karimnagar:  వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలకు ఘనంగా అంకుర్పాణ

- శేషవాహనంపై శ్రీవారి విహారం...

కరీంనగర్‌ కల్చరల్‌, జనవరి 24 (ఆంధ్రజ్యోతి) : జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్‌ వేంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం ఘనంగా అంకురార్పణ జరిగింది. వానమామలై పవనకుమారాచార్య బృందం నేతృత్వంలో ఉదయం పాతబజార్‌ గౌరీశంకరాలయంలో మృత్సంగ్రహణం (పుట్టమన్ను తేవడం) నిర్వహించారు. శోభాయాత్రగా పుట్టమన్ను ఆలయానికి తీసుకవచ్చారు. సాయంత్రం విశ్వక్సేన ఆరాధన, పుణ్యాహవాచనం, రక్షాబంధనం జరిగాయి. రాత్రి శ్రీవారు శేషవాహనంపై ఆలయ మాడ వీధుల్లో విహరించారు. కార్యక్రమంలో సుడా చైర్మన్‌ కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కాంగ్రెస్‌ కార్పొరేషన్‌ అధ్యక్షుడు వైద్యుల అంజన్‌కుమార్‌, కరీంనగర్‌ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు, నాయకులు కటకం వెంకటరమణ, ఆకారపు భాస్కర్‌రెడ్డి, ఉమ్మడి జిల్లా దేవాదాయశాఖ సహాయ కమిషనర్‌ నాయిని సుప్రియ, వంశపారంపర్య ధర్మకర్తలు చకిలం శ్రీనివాస్‌, చకిలం గంగాధర్‌, ఈవో కె సుధాకర్‌, అర్చకులు లక్ష్మీనారాయణాచార్యులు, నాగరాజాచార్యులు పాల్గొన్నారు. సాంస్కృతిక కళావేదికపై గాయకుడు, ఉత్సవాల కల్చరల్‌ ఆర్గనైజర్‌ గోగుల ప్రసాద్‌ నేతృత్వంలో ఉదయం, సాయంత్రం నిర్వహించిన కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.

- నేటి కార్యక్రమాలు..

ఆదివారం ఉదయం 8 గంటలకు అగ్నిప్రతిష్ఠ, అనంతరం ధ్వజారోహణం. 9 గంటల నుంచి సూర్యప్రభవాహనసేవ, సాయంత్రం 6 గంటల నుంచి భేరీ పూజ, చంద్రప్రభవాహనసేవ నిర్వహిస్తారు. ఉదయం, సాయంత్రం భజనలు, పారాయణాలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి.

Updated Date - Jan 24 , 2026 | 11:30 PM