Karimnagar: నేడు వేంకటేశ్వరస్వామి శోభాయాత్ర
ABN , Publish Date - Feb 01 , 2026 | 12:00 AM
కరీంనగర్ కల్చరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): ఆదివారం సాయంత్రం 5.30లకు మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి శోభాయాత్ర జరుగనుంది.
కరీంనగర్ కల్చరల్, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): జిల్లా కేంద్రంలోని మార్కెట్‌రోడ్ వేంకటేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం 5.30లకు మార్క్‌ఫెడ్ గ్రౌండ్ నుంచి వేంకటేశ్వరస్వామి శోభాయాత్ర జరుగనుంది. బ్రహ్మోత్సవాలు గురువారం ముగియగా సమ్మక్క సారలమ్మ జాతర దృష్ట్యా ఫిబ్రవరి 1న శోభాయాత్ర నిర్వహిస్తున్నారు. శ్రీవారి వాహన శ్రేణి రాంనగర్ నుంచి మంకమ్మతోట, గీతాభవన్ చౌరస్తా, వన్‌టౌన్ పోలీసు స్టేషన్ ద్వారా వేంకటేశ్వరాలయం చేరుకోనుంది.