Karimnagar: డీర్ పార్క్‌లో వన మహోత్సవం
ABN , Publish Date - Jun 19 , 2026 | 12:21 AM
కరీంనగర్ క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని డీర్ పార్క్‌లో వన మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు.
కరీంనగర్ క్రైం, జూన్ 18 (ఆంధ్రజ్యోతి): అటవీ శాఖ ఆధ్వర్యంలో నగరంలోని డీర్ పార్క్‌లో వన మహోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ చిత్రా మిశ్రా డీర్‌పార్క్ ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ... పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడం ప్రతీ ఒక్కరి బాధ్యత అన్నారు. భావితరాలకు పచ్చని తెలంగాణను అందించాలంటే మొక్కల పెంపకాన్ని ప్రజా ఉద్యమంలా చేపట్టాలని తెలిపారు. అనంతరం హైదరాబాద్‌లో నిర్వహించిన బహిరంగ సభలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రసంగాన్ని డీర్‌పార్క్‌లో ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్ర్కీన్ ద్వారా అధికారులు తిలకించారు. అంతకుముందు కలెక్టరేట్ కాన్ఫరెన్స్ హాల్లో సీఎం సభను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్ వీక్షించారు. కార్యక్రమంలో సీపీ గౌస్ ఆలం, మేయర్ కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ వై సునీల్‌రావు, మున్సిపల్ కమిషనర్ ప్రపుల్‌దేశాయ్, అడిషనల్ కలెక్టర్ డాక్టర్ అశ్విని తానాజీ వాఖడే, ఆర్డీవో షర్మిల, మెప్మా పీడీ స్వరూపరాణి, డీఆర్‌డీవో గీత, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి అనిల్ ప్రకాశ్, అటవీ శాఖ రేంజి అధికారులు షౌకత్‌హుస్సేన్, షౌకత్‌అలీ పాల్గొన్నారు.