Share News

Karimnagar: బాలభవన్‌లో కొత్త కోర్సుల్లో శిక్షణ ప్రారంభం

ABN , Publish Date - May 11 , 2026 | 11:45 PM

కరీంనగర్‌ కల్చరల్‌, : నగరంలోని జవహర్‌ బాలభవన్‌లో సోమవారం ఉదయం నుంచి అన్ని అంశాల్లో తరగతులు ప్రారంభించారు. 600 మంది వరకు విద్యార్థులు శిక్షణ పొందే అవకాశం ఉంది.

Karimnagar:  బాలభవన్‌లో కొత్త కోర్సుల్లో శిక్షణ ప్రారంభం

కరీంనగర్‌ కల్చరల్‌, : నగరంలోని జవహర్‌ బాలభవన్‌లో సోమవారం ఉదయం నుంచి అన్ని అంశాల్లో తరగతులు ప్రారంభించారు. 600 మంది వరకు విద్యార్థులు శిక్షణ పొందే అవకాశం ఉంది.

- శిక్షణ వివరాలివే...

నృత్యం ఉదయం 9 నుంచి 10 వరకు, సంగీతం, మృదంగం 9.30 నుంచి 10.30, చిత్రలేఖనం, హ్యాండ్‌ రైటింగ్‌, కుట్లు-అల్లికలు, మెహందీ, ఆర్ట్‌ అండ్‌ క్రాఫ్ట్స్‌ 10.30 నుంచి 11.30 వరకు నేర్పిస్తున్నారు. ఉదయం 8 నుంచి 9 వరకు అబాకస్‌, భగవద్గీత శ్లోకాలు, కర్రసాము, 9 నుంచి 10 వరకు యోగా, 9.15 నుంచి 10.15 వరకు శాస్త్రీయ నృత్యం, 11.30కు ఛెస్‌ అంశాల్లో శిక్షణ ప్రారంభమైంది. శిక్షణలో పాల్గొనే నూతన విద్యార్థులు ఆధార్‌కార్డ్‌ జిరాక్స్‌, పాస్‌పోర్ట్‌ సైజ్‌ ఫోటో సమర్పించాల్సి ఉంటుంది.

- విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలి

- కట్ట మంజులాదేవి, సూపరింటెండెంట్‌, బాలభవన్‌

రెగ్యులర్‌ అంశాలతో పాటు ఇతర అంశాల్లో శిక్షణ కోసం పంపిన ఫైల్‌ అప్రూవల్‌ వచ్చింది. సోమవారం నుంచి శిక్షణ ప్రారంభించాం. విద్యార్థులు ఈ శిక్షణను సద్వినియోగం చేసుకోవాలి. తల్లిదండ్రులు ప్రోత్రాహాన్ని అందించాలి. కలెక్టర్‌, అడిషనల్‌ కలెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతున్నాం. విద్యార్థులు ఎండ తీవ్రత దృష్ట్యా జాగ్రత్తలు తీసుకోవాలి. వాటర్‌ బాటిల్స్‌, స్నాక్స్‌ తెచ్చుకోవాలి.

Updated Date - May 11 , 2026 | 11:45 PM