Share News

Karimnagar: చెరువులకు పర్యాటక కళ

ABN , Publish Date - May 01 , 2026 | 12:08 AM

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లోని కొత్తపల్లి, రేకుర్తి చెరువుల ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి.

Karimnagar: చెరువులకు పర్యాటక కళ

- కొత్తపల్లి చెరువుకు రూ. 2.86 కోట్లు

- రేకుర్తి చెరువుకు రూ. 1.80 కోట్లు

భగత్‌నగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి): కరీంనగర్‌లోని కొత్తపల్లి, రేకుర్తి చెరువుల ఆధునికీకరణకు నిధులు మంజూరయ్యాయి. చెరువుల సుందరీకరణకు అమృత్‌ 2.0 పథకంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం కొత్తపల్లి ఊర చెరువుకు 2.86 కోట్లు, రేకుర్తి చెరువుకు 1.80 కోట్ల రూపాయలు మంజూరు చేసింది. దీంతో కొత్తపల్లి ఊర చెరువు, రేకుర్తిలోని పెంటకమ్మ చెరువులు పర్యాటక కళ సంతరించుకోనున్నాయి. కేంద్ర నిదులతో అమృత్‌ 2.0 పథకంలో భాగంగా మంజూరైన నిధులతో కొత్తపల్లి ఊర చెరువుకు సుందరీకరణ పనులు చేపట్టనున్నారు. కట్టల పటిష్టీకరణ, రక్షణ, నీటి నిర్వహణ చేపట్టడంతో చెరువుల రూపు రేఖలు మారనున్నాయి. ఆయా నిధులతో చెరుకటల్ట బలోపేతం, రక్షణ చర్యలు చేపట్టడంతో పాటు అందంగా తీర్చిదిద్దే పనులను చేపట్టనున్నారు. రేకుర్తి పెంటకమ్మ చెరువుకు అభివృద్ధిలో భాగంగా చెరువు పరిసరాల్లో పచచదనంపెంపు చర్యలు తీసుకోనున్నారు. నీటి నిల్వను కాపాడేందుకు ఆర్‌సీసీ ఓపెన్‌ డ్రైయిన్‌ నిర్మాణం చేపడుతారు. ఈ అభివృద్ధి పనులతో చెరువులు అందంగా మారుతాయి. నీటి సంరక్షణకు పెరుగుతుంది. నగరవాసులు ఈ చెరువుల వద్దకు వచ్చి సేదతీరవచ్చు.

ఫ పెరగనున్న భూగర్భ జలాలు

కొత్తపల్లి ఊర చెరువు, రేకుర్తిలోని పెంటకమ్మ చెరువులను అభివృద్ధి చేస్తే భూగర్భ జల వనరులు పెరగడంతో పాటు, రైతులకు ఎంతో ఊపయోగకరం కానున్నాయి. కొత్తపల్లి చెరువు నిండుకుంటే కరీంనగర్‌ చుట్ట పక్కల ప్రాంతాల వారికి తాగునీటి ఇబ్బందులు తీరనున్నాయి. కొత్తపల్లి చెరువు నిండితే కరీంనగర్‌లోని విద్యానగర్‌, శాతావాహన ఏరియా ప్రాంతం, రేకుర్తి, ఆరెపల్లి, సీతారాంపూర్‌లో నీటి నిల్వలు పెరిగి నీటి అవసరాలు తీరుతాయి.

ఫ వేసవిలోనే పనులు చేపట్టాలి

- సిహెచ్‌ శ్రీనివాస్‌, రైతు కొత్తపల్లి

రైతులకు ఇబ్బందులు కలగకుండా వేసవిలోనే చెరువు ఆధునీకరణ పనులు చేపట్టాలి. జూన్‌ నెలలో వర్షాకాలం ప్రారంభమైతే చెరువులో మట్టిని తీయడం వీలు కాదు. ఎండాలకాలంలో పనులు చేపడితే రైతులకు అవసరమైన చెరువు మట్టిని తీసుకువెళ్లే అవకాశం ఉంటుంది. చెరువు ఆధునీకరణ పనులతో భూగర్భ జలాలు పెరిగి రైతుల ఇబ్బందులు తొలగిపోనున్నాయి.

Updated Date - May 01 , 2026 | 12:08 AM